క్రైమ్/లీగల్

రూ. 12 లక్షలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 31: పట్టణంలో రూ.12 లక్షలు తరలిస్తుండగా పట్టుకున్నట్లు నగర పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి వెల్లడించారు. వాహనాలను తనిఖీ చేస్తున్న విషయం గ్రహించిన కొందరు అనుమానం రాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల మాదిరిగా భారీ మొత్తంలో తరలించుకుపోతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా భారీ స్థాయిలో రోజుకోచోట నగదు, నగలు, మద్యం తరలిస్తుండగా పోలీస్ తనిఖీల్లో పట్టుబడుతుండడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగానే బుధవారం నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తుండగా రూ.12 లక్షలు పట్టుబడినట్లు పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఇదేవిధంగా ఆర్‌ఎన్‌విడబ్ల్యూల అమలు మూడు కేసుల్లో 12 మంది బైండోవర్, చొప్పదండి నియోజకవర్గంలో మూడు కేసుల్లో ఏడుగురు బైండోవర్, మానకొండూర్ నియోజకవర్గంలో నాలుగు కేసుల్లో 48 మంది బైండోవర్, హుజూరాబాద్‌లో ఏడు కేసుల్లో 23 మంది బైండోవర్, ఒక ఎంబిడబ్ల్యూ అమలు, హుస్నాబాద్‌లో రెండు కేసుల్లో 20 మంది బైండోవర్, ఏడుగురు మందు బాబులకు వివిధ న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు జైలుశిక్ష, జరిమానాలు రూ.15,300 విధించారని తెలిపారు.