క్రైమ్/లీగల్

ఘాట్‌లో ఆర్టీసీ బస్సును ఢీ కొన్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతకొమ్మదినె్న, నవంబర్ 1: కర్నూలు -చిత్తూరు జాతీయ రహదారి చింతకొమ్మదినె్న మండల పరిధిలోని గువ్వలచెరువు ఘాట్ మొదటి మలుపులో గురువారం జరిగిన ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొన్న ప్రమాదంలో 15మంది ప్రయాణీకులకు స్వల్పగాయాలయ్యాయి. సికెదినె్న ఎస్‌ఐ హేమకుమార్ తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. రాయచోటి నుంచి కడప వైపువచ్చే ఆర్టీసీ హయ్యర్ బస్సు గువ్వల చెరువు ఘాట్ నుండి చివరి మలుపు దిగుతుండగా ఎదురుగా కడప నుంచి రాయచోటి వైపు వెళ్తున్న ఇండికా కారును తప్పించబోతుండగా రాయచోటి నుంచి కడప వైపువచ్చే లారీ వెనుకవైపు బస్సును ఢీ కొనడంతో బస్సు రోడ్డుకు అడ్డంగా బోల్తాపడింది. ఈ సంఘటనలో బస్సులో ఉన్న ప్రయాణీకులకు 15మందికి స్వల్పగాయాలయ్యాయి. ఈప్రమాదానికి కారణం లారీకి బ్రేక్ ఫెయిల్ కావడమే కారణమని తెలుస్తోంది. అయితే లారీ వెనుకవైపు ఢీ కొనడంతో లారీకి భారీగా నష్టం జరిగింది. ఈప్రమాదంలో ఇండికా కారు బస్సుకు, రోడ్డుపక్కన ఉన్న ప్రొటెక్షన్ వాల్ మద్యలో ఇరుక్కుంది. దీంతో కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈప్రమాదం పగలు జరగడంతో స్థానికులు వెంటనే స్పందించి బస్సులో నుంచి ప్రయాణీకులను దించి గాయపడిన వారిని 108 వాహనం ద్వారా రిమ్స్‌కు తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. సికె దినె్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదం ఘాట్ రోడ్డులో జరగడంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగింది. సికె దినె్న పోలీసులు చొరవ తీసుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.