క్రైమ్/లీగల్

పెదమక్కెనలో గృహిణి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, నవంబర్ 1: మండల పరిధిలోని పెదమక్కెన గ్రామంలో ఓ వ్యక్తి భార్యను బాడిశతో కొట్టి హత్య చేశాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వీరయ్యచౌదరి తెలిపిన సమాచారం ప్రకారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఈ సంఘటన జరిగింది. గరికపాటి వెంకటరమణ(35)ను ఆమె భర్త కోటేశ్వరరావు క్షణికావేశంతో బాడిశతో తల మీద మోది హత్య చేశాడు. భార్య మృతి చెందిన వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఇది గమనించిన వారు కోటేశ్వరరావును ఆసుపత్రికి తీసుకెళ్లి పురుగు మందు కక్కించటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈమేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం వెంకటరమణ మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.