క్రైమ్/లీగల్

కేంద్రీయ విద్యాలయం నుంచి తప్పిపోయిన ముగ్గురు విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, నవంబర్ 1: బొల్లారం పోలీస్ స్టేషన్ పరిథిలోని కేంద్రీయ విద్యాలయం నుండి ముగ్గురు విద్యార్థులు పాఠశాల నుంచి తప్పిపోయిన ఘటన బుధవారం జరిగింది. కేంద్రీయ విద్యాలం ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నాగారం బాబు రెడ్డి కాలనీలో నివాసం ఉన్న జివిఆర్ రాఘవేంద్ర కుమారుడు సాయి రోనిక్, యాప్రాల్ లోని మీనా ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉన్న యస్‌కుమార్ మాజి కుమారుడు సునీల్ కుమార్ అల్వాల్ సుభాష్ నగర్ నివాసి మురళీధర్ కుమారుడు బోల్లు విక్రమ్ లు ఉదయం ఇంటి నుండి ఇద్దరు సునీల్‌కుమార్, సాయి రోనిక్‌లు రోజువారిగ వచ్చినట్లు సైకిల్‌పై వచ్చారు. వారి సైకిల్‌లను మామూలుగా స్టాండ్‌లో పెట్టారు. మరో విద్యార్థి బోల్లు విక్రమ్ ఆటోలో వచ్చి గేటు బయట దిగాడు ముగ్గురు కలిసి పాఠశాలలో తరగతిగదిలోకి వెళ్లకుండా బయటకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి విద్యార్థులు చేరకపోవటంతో ప్రిన్సిపల్‌కు తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకోని విద్యార్థులకోసం దర్యాప్తు చేస్తున్నారు.
బాలిక ఆత్మహత్య
సనత్‌నగర్, నవంబర్ 1: స్కూల్‌కు వెళ్లమని తండ్రి మందలించడంతో క్షణికావేశానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండారి భాస్కర్ ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తూ బికే గూడాలో నివాసం ఉంటున్నాడు. అతని కుమార్తె ప్రభ (16) స్థానికంగా ఉన్న జయభారతి స్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. రెండు రోజులుగా పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండటంతో గురువారం తప్పకుండా వెళ్లాలని తండ్రి భాస్కర్ మందలించాడు. అనంతరం తల్లిదండ్రులు విధులకు హాజరు అయ్యేందుకు వెళ్లిపోగా ఇంట్లోని ఫ్యాన్‌కు ప్రభ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శివసాయి ఆలయ అర్చకుడి మృతి
ఖైరతాబాద్, నవంబర్ 1: యువకుడి దాడిలో గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వరంగల్ పోచమ్మమైదాన్ శివసాయి ఆలయ అర్చకుడు దేవళ్ల సత్యనారాయణ(70) మృతి చెందారు. గతనెల 26న దేవాలయానికి చెందిన మైక్‌ను బంద్ చేయాలంటూ స్థానికంగా ఉండే ఓ వర్గానికి చెందిన యువకుడు సత్యనారాయణతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా పిడి గుద్దులతో దాడి చేశాడు. దాడిలో సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యాడు. వెంటనే అతన్ని స్థానిక ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పక్కటెముకలు విరిగిపోవడంతో పాటు లివర్‌కు గాయం అయిందని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు గతనెల 30న బుధవారం అతడిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సత్యనారాయణ గురువారం ఉదయం 8గంటల ప్రాంతంలో మృతి చెందారు.