క్రైమ్/లీగల్

సబ్సిడీ యూరియాను పట్టుకున్న ఎస్‌ఓటీ పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, నవంబర్ 1: రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియాను కొంతమంది అక్రమ వ్యాపారులు పరిశ్రమలకు తరలిస్తున్నారు. గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామ సమీపంలో ఉన్న అల్మో ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నందిగామ ఎస్‌ఐ నర్సింహారెడ్డి కథనం ప్రకారం.. మండల పరిధిలోని అప్పారెడ్డిగూడ గ్రామ సమీపంలో ఉన్న అల్మో ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు సబ్సిడీ యూరియా సరఫరా అవుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారని వివరించారు. దాడుల్లో మొత్తం 84బ్యాగుల యూరియా లభించినట్లు, దీన్ని స్థానిక వ్యవసాయ శాఖ అధికారిణి శే్వతకు అప్పగించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు పరిశ్రమ యజమాన్యంపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన నివేధిక ప్రకారమే కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారిణి శే్వతను వివరణ కొరగా పరిశ్రమ నిర్వాహకులు ఎన్ని యూరియా బ్యాగులకు ఎన్‌ఓసీ తీసుకున్నారనే విషయంపై విచారణ చేస్తున్నామని, దాన్ని బట్టి పోలీసులకు సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు.