క్రైమ్/లీగల్

రామంతాపూర్‌లో దొంగల హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, నవంబర్ 1: ఎన్నికల హడావుడిలో పోలీసుల బిజీగా ఉన్నట్లు గమనించిన దొంగలు రామంతాపూర్‌లో హల్‌చల్ చేశారు. బాలాజీనగర్‌లోని రెండిళ్లలో తాళం విరగొట్టి లోపల ఉన్న రూ.15లక్షల నగదు, 20 తులాల బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో పట్టపగలు జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బాలాజీనగర్‌లో నివసిస్తున్న డీ.శేఖర్ సికింద్రాబాద్‌లో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల ప్లాటును అమ్ముకోగా వచ్చిన డబ్బులను ఇంట్లో భద్రంగా దాచుకున్నాడు. వ్యాపారం పనిపై బయటకు వెళ్లగా ఇంట్లో ఉన్న అతని భార్య పూజిత మెడికల్ షాపునకు వెళ్లి వచ్చేలోగా దొంగలు తాళం పగులగొట్టి లోపల ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, రూ.8లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఇదే ప్రాంతంలో ఉన్న లలిత అంబర్‌పేట్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే లోగా లోపలికి చొరబడి ఇంట్లో ఉన్న రూ.5లక్షల నగదు, ఐదు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.