క్రైమ్/లీగల్

వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేపాక్షి, నవంబర్ 2: మండల కేంద్రమైన లేపాక్షి విద్యుత్ సబ్‌స్టేషన్ వెనుక ఓ వ్యక్తి చింతచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎఎస్సై సుబ్బరాంనాయక్ తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గత ఐదు రోజుల క్రితం షఫీవుల్లా అనే వ్యక్తి ఇంటి నుండి బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్ళలో వెతికినా ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం ఉదయం సబ్‌స్టేషన్ వెనుక పనుల నిమిత్తం వెళుతున్న గ్రామస్తులు కుళ్లిపోయిన దుర్వాసన వస్తుండటాన్ని గమనించి పరిశీలించారు. అయితే ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గమనించి మృతుడు షఫీవుల్లాగా నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

శవమై తేలిన బీటెక్ విద్యార్థి

గుంతకల్లురూరల్, నవంబర్ 2 : సరదాగా ఈత కొట్టేందుకు గురువారం సాయంత్రం వెళ్లిన బీటెక్ విద్యార్థి హంద్రీనీవా కాలువలో శవమై తేలిన విషాద ఘటన శుక్రవారం పట్టణంలో వెలుగుచూసింది. బాధిత బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు స్థానిక హనుమేష్‌నగర్‌లో నివాసముటున్న రామదాసు కుమారుడు చిన్నా (25) గుత్తి గేట్స్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. గురువారం పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న హంద్రీనీవా కాలువలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి గళ్లంతయ్యాడు. గళ్లంతైన విద్యార్థి చిన్నా కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామ సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువలో శవమై తేలాడాని మృతుని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు.
కుటుంబ సభ్యులకు వైవీఆర్ పరామర్శ
హంద్రీనీవా కాలువలో పడి విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి శుక్రవారం స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకుని విద్యార్థి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.