క్రైమ్/లీగల్

ట్రాక్టర్ ఢీకొని మహిళ, చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, నవంబర్ 2: రోడ్డు దాటుతున్న మహిళా, చిన్నారి పాపను ట్రాక్టర్ ట్రాలీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన పట్టణంలోని ప్రధాన పోస్ట్ఫాస్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. రవీంద్రభారత్ నగర్‌కు చెందిన రవళి (30), కోడలు వరసైన చిన్నారి అక్షర(4) వారిరువురు స్థానిక ఆసుపత్రిలో వైద్య చికిత్సలు నిర్వహించుకొని తిరిగి ఇంటికి తిరిగి వస్తున్నారు. పాత బస్టాండ్ నుండి పట్టణంలోకి వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ వారికి తగలడంతో వారిద్దరు ట్రాలీ టైర్ కిందపడగా అక్షర అక్కడిక్కడే చనిపోగా, రవళి తీవ్రగాయాలు కావడంతో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు అందిస్తుండగా ఆమె మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఇరువురి కుటుంబాలను మున్సిపల్ చైర్‌పర్సన్ నువ్వుల ప్రసన్న పరామర్శించి ప్రభుత్వం నుండి సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతాం
* సూర్యాపేట ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు
మఠంపల్లి, నవంబర్ 2: అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని సూర్యాపేట ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు. అనంతరం మఠంపల్లి పోలీస్‌స్టేషన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అక్కడ అసాంఘిక శక్తులను బైండోవర్ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు సుమారుగా 1600మందిని బైండోవర్ చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని కృష్ణపట్టే ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి గ్రామం ప్రారంభంలో చివరిలో సీసీ కెమెరా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకుముందు మండల కేంద్రంలో ఐటీబీపీ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఎన్నికల నాటికి ఏ గ్రామంలోనైనా గొడవలు జరగకుండా పెట్రోలింగ్ చేస్తున్నామని, ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఫిర్యాదుదారుడు స్టేషన్‌కు వచ్చినప్పుడు వ్యవహరించాల్సిన విధి విధానాలపై మైక్ 3 ఫిటిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈకార్యక్రమంలో కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, ఎస్‌ఐ రంజిత్ పాల్గొన్నారు.