క్రైమ్/లీగల్

సోమశిలలో దూకి గుర్తుతెలియని యువతి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతసాగరం, నవంబర్ 2 : సోమశిల జలాశయంలో గుర్తు తెలియని యువతి (17) ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు 17 ఏళ్ల వయస్సున్న యువతి జలాశయంలో దూకినట్లు ప్రాజెక్టు సిబ్బంది తమకు సమాచారం ఇచ్చారని ఎస్‌ఐ వెంకటేశ్వర్లురెడ్డి తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎట్టకేలకు యువతి మృతదేహాన్ని గుర్తించి వెలికి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. మృతిచెందిన యువతి అవివాహిత అని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టు జేఈ కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలియజేశారు. జలాశయం గేట్ల వద్ద కనీసం లైట్లు లేకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకట్లో ఎవరు తచ్చాడుతున్నారో. ఎవరు దూకేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు లైట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

డిగ్రీ పరీక్షల్లో 8మంది విద్యార్థులు డీబార్
వెంకటాచలం, నవంబర్ 2 : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల్లో శుక్రవారం జరిగిన డిగ్రీ మొదటి సెమిస్టర్ పరిక్షల్లో ఎనిమిది మంది విద్యార్ధులు డీబార్ అయినట్లు వీఎస్‌యూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సాయిప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్ పరిక్షల్లో 13,384 మంది విద్యార్థులకు గాను 12,111 మంది విద్యార్థులు హజరు కాగా మిగిలిన 1,273 మంది విద్యార్థులు గైర్హాజరయారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన 5వ సెమిస్టర్ డిగ్రీ పరీక్షల్లో 8,469 మంది విద్యార్థులకు గాను 7,413 మంది విద్యార్థులు హాజరు కాగా మిగిలిన 1,056 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.