క్రైమ్/లీగల్

శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవాలయంలో పంచలోహ విగ్రహాల చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, నవంబర్ 2: రాజాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రంగారెడ్డిగూడ గ్రామంలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవాలయంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయం తలుపుల తాళం పగులగొట్టి పంచలోహ విగ్రహాలను దొంగిలించినట్లు ఎస్సై నర్సయ్య తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.గురువారం ప్రతినిత్యం పూజలు చేసే పూజారి పూజలు నిర్వహించి దేవాలయం పక్కనే ఉన్న తన ఇంటింటి వెళ్లినట్లు ఎస్సైతెలిపారు. యథావిధిగా శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించేందుకు పూజారి రాగా దేవాలయ తలుపులు తెరిచి ఉండడంతో లోపలికివెళ్లి చూడగా శ్రీదేవి,్భదేవి, సత్యనారాయణస్వామి, సుదర్శన విగ్రహాలు కనిపించకపోవడంతో గ్రామస్థులకు తెలిపారు. విగ్రహాలతో పాటు పూజా సామాగ్రిని కూడా దొంగిలించారు. సంఘటన స్థలాన్ని జడ్చర్ల రూరల్ సిఐ రవీందర్‌రెడ్డి సందర్శించారు. పూజారి అయ్యవారి రవీంద్రాచార్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుజరుపుతున్నట్లు ఎస్సై నర్సయ్య తెలిపారు.