క్రైమ్/లీగల్

ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, నవంబర్ 2: మహిళపై దాడి చేసి బెదిరించి మెడలోని బంగారు ఆభరణాల చోరీ కేసులో ముగ్గురిని ఘట్‌కేసర్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద బైక్, చైన్, సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ గోనె సందీప్ తెలిపిన వివరాల ప్రకారం యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వద్ద నివసిస్తున్న కొత్తగూడెం జిల్లా భద్రాద్రి మేదర్ బజార్‌కు చెందిన పీ.రాకేష్ (25), గుంటూరు జిల్లా పిరంగిపురం గ్రామానికి చెందిన కడెం యలమంద ప్రదీప్ కుమార్ అలియాస్ ప్రదీప్ (22), కొత్తగూడెం జిల్లా భద్రాచలం శిల్పినగర్‌కు చెందిన ఎస్.దుర్గాప్రసాద్ (22) గత అక్టోబర్ నెల 26వ తేదీన అన్నోజిగూడలో నడుచుకుంటూ వెళ్తున్న చెన్నూరు భాగ్యలక్ష్మిపై దాడి చేసి బలవంతంగా మెడలోని చైన్‌ను లాక్కొని పారిపోయారు. దర్యాప్తులో భాగంగా యంనంపేట చౌరస్తాలో వెహికిల్ చెక్ చేస్తుండగా ముగ్గురు పట్టుబడ్డారు. విచారించగా చోరీ గుట్టు రట్టయిందని ఏసీపీ తెలిపారు.

చోరీలకు పాల్పడుతున్న నలుగురి అరెస్టు

గచ్చిబౌలి, నవంబర్ 2: రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడుతున్న యూపీకి చెందిన ముగ్గురు సభ్యుల ముఠాతో పాటు నగరానికి చెందిన ఘరానా గజదొంగను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితుల నుంచి రూ.50 లక్షల విలువ చేసే ఆర కేజీ విలువైన వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. యూపీకీ చెందిన మహ్మద్ అబీద్ ఆలీ (20), షేక్ ఫార్కు ఉసేన్ (22), మోహన్ యాదవ్ (20), నగరంలో పెయింటింగ్ పని చేయడానికి వచ్చారు. జల్సాలకు అలవాటుపడిన నిందితులు డబ్బుల కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించారు. సెప్టెంబర్‌లో శంషాబాద్‌లో అమెరికాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఫాం హౌస్ తాళం పగలగొట్టి 150 గ్రాముల బంగారం, వజ్రాలు పొదిగిన నగలను దొచుకు పోయారు. దొంగతనం అయిన సమయంలో ఫాం హౌస్‌లో ఎలాంటి ఆధారాలు లభించలేదని అయినప్పటికీ శంషాబాద్ సీసీఎస్ పోలీసులు నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసారని సీపీ తెలిపారు. మహ్మద్ అబీద్ ఆలీ, మోహన్ యాదవ్ యూపీలోని గోరఖ్‌పూర్‌లో కిరణా జనరల్ స్టోర్‌లో పని చేస్తున్న సమయంలో 50వేలు దొంగిలించిన కేసులో జైలుకు వెళ్లారని సీపీ తెలిపారు. జనవరిలో జైలు నుండి విడుదలైన నిందితులు నగరానికి పెయింటింగ్ పని చేయడం కోసం వచ్చారని మార్చిలో ఫారుక్ వచ్చినట్లు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసిన శంఫాబాద్ సీసీఎస్ పోలీసు బృందాన్ని సీపీ అభినందించారు. కూకట్‌పల్లిలోని ఎల్లమ్మ బండకు చెందిన అవతార్‌సింగ్ (30)ని బాలానగర్ సీపీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి 20లక్షల విలువ చేసే 400 గ్రాముల వజ్రాలు పొదిగిన బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. అవతార్ సింగ్ సైబరాబాద్ పరిధిలో రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలకొట్టి 25 చోరీలు చేసిన కేసులలో నిందితుడని సీపీ వివరించారు. గతంలో పలు దొంగతనాల కేసులో సంగారెడ్డి పోలీసులు 2016లో అరెస్టు చేసారని అన్నారు. జైలు నుండి విడుదలైన తరువాత నిందితుడు పాత పద్ధతిలోనే దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కినట్లు సజ్జనార్ చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసిన బాలానగర్ సీసీఎస్ బృందాన్ని సీపీ అభినందించారు. కార్యక్రమంలో క్రైం డీసీపీ జానకీ షర్మిలా, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, సీఐలు శ్రీనివాస్, చంద్రబాబు పాల్గొన్నారు.