క్రైమ్/లీగల్

బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, నవంబర్ 3 : పరిగి మండలం శాసనకోటలో 60 ఏళ్ల వృద్ధుడు నారాయణరెడ్డి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని పొరుగింట్లో ఉన్న నారాయణరెడ్డి చాక్లెట్లు ఇస్తానని నమ్మబలికి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక బిగ్గరగా ఏడ్చుకుంటూ వచ్చి విషయాన్ని తల్లికి చెప్పింది. తల్లిదండ్రులు, పరిసర ప్రాంతవాసులు నారాయణరెడ్డి ఇంటి వద్దకు వెళ్లగా అప్పటికే పరారయ్యాడు. వెంటనే పోలీస్‌స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు పరిగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హిందూపురం రూరల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పామిడి, నవంబర్ 3 : మండల పరిధిలోని రామరాజుపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నారెడ్డి (54) అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సుంకమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పత్తి పొలాన్ని చూసేందుకు వెళ్లి చెన్నారెడ్డి తిరిగి ద్విచక్ర వాహనంలో తిరిగి వస్తూ రామరాజుపల్లి వైపు రోడ్డును దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ మహబూబ్‌బాషా తెలిపారు.