క్రైమ్/లీగల్

కల్తీ ఆవునెయ్యి దందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, నవంబర్ 3: నగరంలోని టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని గొల్లపాలెం గట్టు, గుడ్డెల పాపయ్య వీధిలోని శ్రీ విజయలక్ష్మీ ఆయిల్ ట్రేడర్స్ పేరుతో ఉన్న ఒక ఇంటిపై శనివారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ రకాల బ్రాండ్ల పేరుతో డాల్డా, పామాయిల్, కెమికల్స్ కలిపి కల్తీ ఆవునెయ్యి తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ఫోర్స్ ఏసీపీ జీ రాజీవ్‌కుమార్ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 15లక్షల విలువైన నాలుగు తయారీ యంత్రాలు, రెండు ప్యాకింగ్ మిషన్లు, గ్యాస్‌పొయ్యి, సిలిండర్, రెండు వేల లీటర్ల కల్తీ ఆవు నెయ్యి, పామాయిల్, డాల్డా డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఏసీపీ రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ గొల్లపాలెం గట్టు బెజ్జాల మేడ వీధికి చెందిన అమర సత్యనారాయణ(45) తన బావమరిది హిమాలయ హోటల్ ప్రాంతానికి చెందిన సగ్గు సుధీర్(38) గొల్లపాలెం గట్టు, గుడ్డెల పాపయ్య వీధిలోని ఒక ఇంట్లో కింద పోర్షన్‌ను అద్దెకు తీసుకుని శ్రీ విజయలక్ష్మీ ఆయిల్ ట్రేడర్స్ పేరుతో కల్తీ ఆవు నెయ్యి తయారు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ రకాల బ్రాండ్ల పేరుతో ముద్రించిన ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఈ కల్తీ నెయ్యి గత కొంతకాలంగా మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా దీన్ని నిర్వహిస్తూ ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించకుండా కల్తీ నెయ్యి ప్యాకెట్లపై ఎలాంటి ట్రేడ్‌మార్కు లేకుండా, చట్ట వ్యతిరేకంగా అమ్మకాలు చేయడం నేరమన్నారు. కల్తీ నెయ్యిని తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న యంత్రాలు, సామగ్రిని టూటౌన్ పోలీసు స్టేషన్‌కు అప్పగించినట్లు ఆయన వివరించారు. దర్యాప్తు జరుగుతోంది.