క్రైమ్/లీగల్

పెట్రోలు పోసుకొని.. బీజేవైఎం నాయకుడి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, నవంబర్ 3: పెట్రోలు పోసుకొని బీజేవైఎం నాయకుని ఆత్మహత్యాయత్నం శనివారం రాత్రి చోటు చేసుకుంది. జగిత్యాల బీజేపి అభ్యర్థి ముదుగంటి రవీందర్‌రెడ్డికి మద్ధతుగా బీజేపి, బీజేవైఎం కార్యకర్తలు మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఆర్డీవో కార్యాలయం ఎదుట పోలీసులకు బీజేపి నాయకులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేవైఎం నాయకుడు ఆముద రాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపి నాయకులు ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. జగిత్యాల ఆర్డీవో సర్ది చెప్పటంతో శాంతించారు.