క్రైమ్/లీగల్

అక్రమంగా తరలిస్తున్న 280 కిలోల గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, నవంబర్ 3: ఏజన్సీ నుండి మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 280 కిలోల గంజాయిని అనకాపల్లి ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేసారు. ఎక్సైజ్ సీ ఐ కామేశ్వరరావు అందించిన వివరాల ప్రకారం శనివారం ఉదయం రోలుగుంట మండలం పెదపేట జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా చింతపల్లి వైపు నుండి వస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన కారును ఆపి తనిఖీ చేయగా కారు సీటు కింద గంజాయి ఫ్యాకెట్లను గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ జాఫర్ షాజహాన్‌పై జి.మాడుగుల మండలం వంజర గ్రామానికి చెందిన మర్రి రామ్మూర్తి(45), కర్ణాటకకు చెందిన ప్రభాకర్(35)లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 6,500 రూపాయల నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకుని కారుతో పాటు బైక్‌ను సీజ్ చేసారు. జి.మాడుగులలో కారులో గంజాయిలోడ్ చేసిన అదే గ్రామానికి చెందిన అణుగూరి శారద(45)పై కూడా కేసు నమోదు చేసినట్లు సీ ఐ తెలిపారు. జి.మాడుగుల వద్ద కిలో గంజాయిని 1,500 రూపాయలు వంతున కొనుగోలు చేసారన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని అంచనా. ఈదాడిలో ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ ఎస్సై , సిబ్బంది పాల్గొన్నారు.
బైక్‌ను తగులబెట్టిన దుండగులు
కోటవురట్ల, నవంబర్ 3: మండల కేంద్రమైన కోటవురట్లలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్లామర్ బైక్‌పై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈసంఘటనలో బైక్ పూర్తిగా దగ్ధమైంది. బైక్ యజమాని, బాధితుడు బత్తుల అప్పారావు మాట్లాడుతూ మూడు నెలల క్రిందట ఈబైక్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీని విలువ 75 వేల రూపాయలుగా పేర్కొన్నాడు. ఈమేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసామన్నారు.
పేకాట శిబిరంపై దాడి 11మంది అరెస్ట్
బుచ్చెయ్యపేట, నవంబర్ 3: మండలంలోని గొర్లెపాలెంలో జరుగుతున్న పేకాట శిబిరంపై శనివారం బుచ్చెయ్యపేట ఎస్‌ఐ కృష్ణారావు తన సిబ్బందితో దాడి చేసి 11మంది జూదరులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ కృష్ణారావు అందించిన వివరాలిలా ఉన్నాయి. ముందుగా అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ కృష్ణారావు తన సిబ్బందితో గొర్లెపాలెంలో జరుగుతున్న పేకాట శిబిరంపై దాడి చేసి, పేకాట ఆడుతున్న 11మందిని అరెస్ట్ చేయటంతో పాటు వారి నుండి 25150రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నారు. ఈదాడుల్లో పట్టుబడినవారిలో మండలంలోని గొర్లెపాలెం గ్రామానికి చెందిని కేశినశెట్టి అప్పారావు, అట్ట కాసులబాబు, ఇందల ఈశ్వరరావు, శొంఠ్యాన గౌరినాయుడు, అట్ట రాము, నేతవానిపాలెం గ్రామానికి చెందిన సేశెట్టి అప్పారావు,తైపురం గ్రామానికి చెందిన పులిగా అప్పారావు, రావికమతం మండలంలలోని గొంప గ్రామానికి చెందిన కలగా కన్నంనాయుడు, మనుభర్తి మాలిబాబు, గుడ్డిప గ్రామానికి చెందిన అధికారి రమణ, నాగులాపల్లి గ్రామానికి చెందిన కానిరేకుల సోమునాయుడు ఉన్నారని బుచ్చెయ్యపేట ఎస్‌ఐ కృష్ణారావు తెలిపారు.