క్రైమ్/లీగల్

అక్షయ పాత్రతో మోసగిస్తున్న ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, నవంబర్ 3: అక్షయ పాత్రతో గ్రామీణ ప్రజలను మోసగిస్తున్న ముఠాను ఎట్టకేలకు చిత్తూరు తాలుకా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. గత కొంత కాలంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఓ ముఠా రాగిపాత్రతో గ్రామాల్లో సంచరిస్తూ ఈపాత్ర ఇంటిలో ఉంటే సిరిసంపదలు కలుగుతాయని నమ్మించి గ్రామీణులను దగా చేయడమే గాక దోపిడీకి పాల్పడుతుండగా ఈ సమాచారం అందుకున్న తాలుకా పోలీసులు శనివారం వలపన్ని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు కార్లు, 50వేల రూపాయల నగదు, ఒక రాగి చెంబును స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు తాలుకా సీఐ శ్రీనివాస్ కథనం మేరకు చిత్తూరు నగరానికి చెందిన గోవింద్, కుమార్, వి.కోటకు చెందిన శ్రీనివాసులు, చెన్నైకు చెందిన మంజునాథ్, కులైకుమార్, వేలూరుకు చెందిన ఖాదర్, చార్లెస్‌లు ముఠాగా ఏర్పడి గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ అక్షయ పాత్ర పేరుతో మోసాలకు పాల్పడడమే గాక ఇండ్లలో వున్న నగలు, నగదును పథకం ప్రకారం దోచుకెళ్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ ముఠా సభ్యులు ముందస్తు పక్కా ప్రణాళికతోకార్లల్లో గ్రామాలుకు వెళ్లి అక్కడ కొందరిని ఎంపిక చేసుకొని వారికి మాయ మాటలుచెప్పి ఇంట్లో అక్షియపాత్ర ఉంటే సిరిసంపదలు దక్కుతాయని, ఇలాంటి పాత్రల తవ వద్ద ఉన్నాయని నమ్మించే వారు. ఈపాత్రను బియ్యపు బస్తాలో ఉంచితే బియ్యం కదిలితే ఆ ఇంట్లో సిరిసంపదలు ఉన్నట్లేనని నమ్మపలికి బేరం కుదుర్చుకొనేవారు. బేరాలు కుదిరిన ఇండ్లలో తమ వద్ద ఉన్న రాగి చెంబును బియ్యపు బస్తాలో ఉంచి అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో బియ్యం కదిలించి నమ్మించే వారు. మోసపోయిన అమాయక ప్రజలు ఈ చెంబును వేలకు వేలు ఇచ్చి కొనుగోలు చేసుకోని ఇండ్లల్లో భద్రపరుచు కోవడం జరుగుతుండేది, ఈ వ్యవహారంపై సమాచారం రావడంతో వీరిపై నిఘా ఉంచడంతో శనివారం ఈ ముఠా ఉయ్యాల చింత గ్రామంలో ఉన్నట్లు సమాచారం రావడంవతో దాడి చేసి వీరిని పట్టుకొన్నట్లు తెలిపారు. ఈవ్వవహారంలో ఏడు గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి , వారి వద్ద నున్న రాగి చెంబు , రెండు కార్లు, రూ 50వేల నగదును స్వాధీనం చేసుకొన్నట్లు చెప్పారు.