క్రైమ్/లీగల్

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ రూరల్, నవంబర్ 3: ప్రేమించిన అమ్మాయిని వివాహమాడేందుకు పెద్దలు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పాల్వంచలో జరిగింది. రూరల్ పోలీసులు, మృతుని బంధువులు ఇచ్చిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఉల్వనూరు గ్రామ పంచాయతీ లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన కాలం నవీన్ ఇటీవలే 10వ తరగతి ఉత్తీర్ణుడై పాల్వంచలోని ఎస్‌ఎంఎస్ హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. లక్ష్మీదేవిపల్లిలోని ఒక అమ్మాయితో నవీన్ ప్రేమలో పడ్డాడు. శుక్రవారం తన ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులకు తెలుపగా వారు మందలించి, సాయంత్రం హాస్టల్‌లో వదిలి వెల్లిపోయారు. తన ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన నవీన్ శనివారం తెల్లవారుజామున కళాశాల ప్రాంగణంలోని వేపచెట్టుకు ఉరేకొని మృతిచెందాడు. తెల్లవారుజామున తోటి మిత్రులు లేచిచూడగా నవీన్ చెట్టుకు వేళాడుతూ కన్పించడంతో వార్డెన్ రాంబాబుకు విషయం తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు నవీన్ మృతదేహాన్ని శవ పరీక్ష కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ అనీల్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.