క్రైమ్/లీగల్

స్నేహితుల చేతిలో యువతి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, నవంబర్ 3: యువతిని నమ్మించి స్వీట్‌లో సెనైడ్ ఇచ్చి స్నేహితులే దారుణంగా హత్యచేసిన సంఘటన మండలంలోని కాకుటూరు పంచాయతీ పరిధిలోని పాత రబ్బర్ ఫ్యాక్టరీ వద్ద శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం నెల్లూరు నగర పరిధిలోని చిన్నబజార్ ప్రాంతం కుమ్మరివీధికి చెందిన షేక్ తహసీన్ (34) ఏంసీఏ వరకు చదువుకుంది. విద్యార్థులకు ట్యూషన్లు చెప్పటంతోపాటు స్థానికంగా వడ్డీవ్యాపారం కూడా చేస్తోంది. నెల్లూరు నగర పరిధిలోని జెండావీధికి చెందిన కాలేషా, ఫర్హద్ హుసేన్, సాధిక్, ఇన్నాలకు తహసీన్ అప్పుగా కొంత డబ్బు ఇచ్చింది. వడ్డీడబ్బులు ఇవ్వాలని ఈ నాలుగురిపై తహసీన్ ఒత్తిడి చేస్తూ వచ్చింది. దీంతో తహసీన్‌ను హతమార్చేందుకు నలుగురు పథకం రచించారు. అందులో భాగంగా తహసీన్‌ను మాట్లాడాలని గతనెల 22వ తేదీన షాహిద్ పిలిచారు. తహసీన్ ఇంటినుంచి బయటకు వెడుతూ షాహిద్ దగ్గరకు వెడుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పింది. పథకం ప్రకారం పక్క ప్రణాళికతో తహసీన్‌ను స్వీట్‌లో సెనైడ్ ఇచ్చి గతనెల 22వ తేదీ రాత్రి హత్య చేశారు. అనంతరం మృతదేహన్ని నెల్లూరు నుంచి ఫర్హద్ హుసేన్ కారులో వెంకటాచలం మండలం కాకుటూరు పంచాయతీ పరిధిలోని పాత రబ్బర్ ఫ్యాక్టరీ వద్దకు తీసుకువెళ్లి అప్పటికే సిద్ధంగా ఉంచిన జేసీబీ సహాయంతో సుమారు 10 అడుగుల గొయ్యితీసి తహసీన్ మృతదేహన్ని పూడ్చిపెట్టారు. ఇంటినుంచి బయటకు వెళ్లిన తహసీన్ తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వాకబు చేశారు. తహసీన్ సెల్‌కు ఫోన్ చేయగా స్వీచ్‌అఫ్ రావటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గతనెల 28వ తేదీర నెల్లూరు చిన్నబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్నబజార్ పోలీసులు మిస్సింగ్ కేసు కేసు నమోదు చేశారు. చిన్నబజార్ సీఐ అబ్దుల్ సుబాహాని తనదైన శైలిలో విచారణ చేపట్టారు. ఫర్హద్ హుసేన్ స్థానిక వీఆర్‌వో సహాయంతో పోలీసులకు లోంగిపోయారు. హత్యకు కారణాలను ఫర్హద్ హుసేన్ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. మృతదేహన్ని పూడ్చిపెట్టిన ప్రాంతానికి నిందితుడు హుసేన్‌ను సీఐ అబ్ధుల్ సుబాహాని, ఎస్సై కరీముల్లా తీసుకువెళ్లారు. వెంకటాచలం తహశీల్దార్ రవీంద్రబాబు అధ్వర్యంలో మృతదేహన్ని శనివారం ఉదయం బయటకు తీసి పంచనామా నిర్వహించారు. తహసీన్ మృతదేహాన్ని చూడగానే తల్లి హజీమున్నీసా, సోదరి రెహనా కన్నీటిపర్యంతమయ్యారు. నిందితులు కాలేషా, సాధిక్, ఇన్నాలు పరారీలో ఉన్నారని, వీనిని త్వరలో పట్టుకుంటామని నెల్లూరు చిన్నబజార్ సీఐ అబ్ధుల్ సుబాహాని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో
గాయపడిన మహిళ మృతి
చాగలమర్రి, నవంబర్ 3: మండలంలోని చింతలచెరువు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన చాగలమర్రికి చెందిన శాంతమ్మ(50) శనివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మోటారు సైకిల్ ఢీకొనడంతో శాంతమ్మ తీవ్రంగా గాయపడగా కర్నూలుకు తరలించామన్నారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.