క్రైమ్/లీగల్

భర్త చేతిలో భార్య హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, మార్చి 4: ఇతరులతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త భార్యను కడతేర్చిన సంఘటన శనివారం రాత్రి పట్టణ శివారులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పట్టణ శివారులోని చెన్నరాయునిపల్లి గ్రామానికి చెందిన పారుమంచాల చిన్నరంగమ్మ (47) ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త కృష్ణయ్య నిత్యం ఇంటివద్ద గొడవలు పడేవాడు. ఈనేపథ్యంలో శనివారం సాయంత్రం పశువుల మేత కోసం పొలం వద్దకు వెళ్ళిన భార్య చిన్నరంగమ్మను అనుసరిస్తూ పొలం వద్దకువెళ్ళి ఆమెతో గొడవకు దిగి గొడ్డలికర్రతో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం భర్త కృష్ణయ్య పురుగులమందు తాగి ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు. పొలానికి వెళ్ళిన రంగమ్మ రాత్రి 8గంటల వరకు ఇంటికి చేరకపోవడంతో బంధువులు ఆమెను వెతుక్కుంటూ పొలం వద్దకు వెళ్ళగా రంగమ్మ మృతిచెంది ఉండగా, భర్త కృష్ణయ్య అపస్మారక స్థితిలో ఉన్నట్లు గమనించి తమకు సమాచారం అందించినట్లు ఎస్సై కోటయ్య తెలిపారు. సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న కృష్ణయ్యను ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం కృష్ణయ్య వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. కాగా, రంగమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. సిఐ భీమానాయక్ ఆధ్వర్యంలో ఎస్సై కోటయ్య కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.