క్రైమ్/లీగల్

రైల్వేలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట) నవంబర్ 4: రైల్వేలో తమకు విస్తృతమైన పరిచయాలు ఉన్నాయని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ 20 లక్షలు వసూలు చేసిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను కటకటాల వెనక్కి పంపారు. పట్ట్భాపురం పోలీసులు ఆదివారం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెస్ట్ డీఎస్పీ సౌమ్యలత వివరాలను వెల్లడించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌కు చెందిన తుమ్మలపూడి నాగార్జున బిటెక్ పూర్తి చేసి ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన చిరుమామిళ్ల వెంకటరమణ, ముతుకూరి బాలాజీలు నాగార్జున అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తమకు రైల్వేశాఖలో పెద్ద పెద్ద వాళ్లతో సంబందాలు ఉన్నాయని రూ 10లక్షలు కడితే రైల్వేలో సూపర్ వైజర్ ఉద్యోగం ఇప్పిస్తామని జీతం నెలకు 62వేలు ఉంటుందని నమ్మబలికారు. అనంతరం నీతో పాటు ఎవరైనా ఉంటే వారికి కుడా ఉద్యోగాలు ఇప్పిస్తామని అందరూ కలసి ఒకేసారి ఉద్యోగాలు చేసుకోవచ్చని నాగార్జునను నమ్మించడంతో నాగార్జున తన బంధువులకు కుడా విషయం చెప్పి వారి వద్ద నుంచి కుడా విడతల వారీగా రూ. 20 లక్షలు నిందితులు ఖాతాలో వేశారన్నారు. ఎన్ని రోజులు గడిచిన ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు పట్ట్భాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా అర్బన్ ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు నిందితులను విచారించగా మోసం జరిగిందని నిర్ధారణకు వచ్చి ఆదివారం బృందావన్ గార్డెన్స్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ 6లక్షల 80వేలు స్వాధీనం చేసుకున్నట్లు సౌమ్యలత తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల ఇప్పిస్తామని ఎవరైనా మాయమాటలు చెబితే అలాంటి వారి వివరాలను పోలీసులకు అందజేయాలని మోసగాళ్ల వలలో నిరుద్యోగులు చిక్కుకోవద్దని డిఎస్పీ సౌమ్యలత సూచించారు. ఈ సమావేశంలో అరండల్‌పేట సిఐ వై శ్రీనివాసరావు, పట్ట్భాపురం ఎస్‌ఐ సిహెచ్ రాంబాబులు పాల్గొన్నారు.