క్రైమ్/లీగల్

బెంగళూరులో రోడ్డు ప్రమాదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగలమర్రి, నవంబర్ 4:బెంగళూరులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చాగలమర్రికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మేడా శ్రీచరణ్(23) దుర్మరణం పాలయ్యాడు. శ్రీచరణ్ తన సోదరి మేడా శ్రీరమ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారని, ఈ సంఘటనలో శ్రీచరణ్ మృతి చెందగా శ్రీరమ్యకు తీవ్రంగా గాయపడినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతపురంలో ఎంబీబీఎస్ చదువుతున్న శ్రీరమ్య పుట్టిన రోజు సందర్భంగా శనివారం తన సోదరుడు శ్రీచరణ్ వద్దకు బెంగళూరుకు వెళ్లిందని వారు తెలిపారు. శ్రీచరణ్ బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఈ విషాధ సంఘటనతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగళూరుకు తరలివెళ్లారు.