క్రైమ్/లీగల్

చోరీలకు పాల్పడిన ఐదుగురు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరరావుపేట, నవంబర్ 5: పట్టణ, పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 6.10లక్షల రూపాయలు సొమ్మును, రెండు మోటారు సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న కానిస్టేబుల్ కరిముల్లా, హోంగార్డు, శ్రీరాంబాబు, పెంచలయ్యలకు రివార్డులను ప్రకటించారు. వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డ షేక్ ఉస్మాన్, షేక్ సాహూల్, చింతల సిసీంద్రీ, పెద్దిబోయిన ఎలియరాజు, వక్కంటి వెంకట రమణలను అరెస్ట్ చేసి వారిని కోర్టుకు హాజరుపర్చనున్నట్లు తెలిపారు. నరసరావుపేట వన్‌టౌన్ పరిధిలోని కొత్తబావి బజార్‌లో, పొదిలి పోలీస్ స్టేషన్, ఐనవోలు, మార్కాపురం పరిధిలో సాహూల్, ఉస్మాన్, సిసీంద్రీలపై కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. గత నెల 24అర్ధరాత్రి సమయంలో పట్టణంలోని కొత్తబావి బజార్‌లో వేము మహీంద్రబాబు, బట్టబోతుల వీరబ్రహ్మం తమ ఇంట్లో నిద్రిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించి, బీరువా తాళాలు పగులగొట్టి, అందులోని బంగారం, వెండి వస్తువులను దొంగిలించారు. సుమారు 126 గ్రాముల బంగారం, 24గ్రాముల వెండి వస్తువులతో పాటు 27వేల రూపాయలు అపహరించారు. వీటితో పాటు రెండు యమహా మోటారు సైకిళ్ళను దొంగిలించినట్లు డీఎస్పీ తెలిపారు. వీరిని సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసినట్లు వివరించారు. అదే విధంగా మండలంలోని గురవాయపాలెం గ్రామంలో మానం వేణు గృహంలో అక్టోబర్ రెండోతేదీన పెద్దిబోయిన ఏలియరాజు, వక్కంటి వెంకట రమణలను 33గ్రాముల బంగారం, 150గ్రాముల వెండి వస్తువులను దొంగిలించినట్లు తెలిపారు. వీటితో పాటు పొలం కాగితాలు, ప్రాంసరీ నోట్లు, వెయ్యి రూపాయల నగదును అపహరించినట్లు తెలిపారు. వీరిని సోమవారం ఉదయం యల్లమంద బైపాస్ జంక్షన్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ రెండు కేసుల్లో నిందితులను పట్టుకున్న రూరల్ సీఐ బీ ప్రభాకర్, ఎస్‌ఐ ఏవీ బ్రహ్మం, ఎఎస్‌ఐ పెంచలయ్య, వన్‌టౌన్ ఎస్‌ఐలు ఎ గోపికృష్ణ, నాగేశ్వరరావు సిబ్బంది శ్రీనివాసరావు, వంశీ, శివశంకర్, జానీ, కరిముల్లా, చంద్రశేఖర్‌లు, సోమేష్, సురేష్‌లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ పట్టణంలో యుద్ధ ప్రాతిపదికన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు.అదే విధంగా ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను పట్టణంలోని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.