క్రైమ్/లీగల్

చీట్టి వ్యాపారం పేరుతో రూ. 5 కోట్ల టోకరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దమ్మపేట,నవంబర్ 5: మండల కేంద్రం దమ్మపేటలో ఓ వ్యక్తి ఘరానా మోసాలకు పాల్పడ్డాడు. చిట్టీల పేరుతొ డబ్బులు వసూలు చేయడం,అధిక వడ్డీ ఆశ చూపి వ్యాపారులను,మద్యతరగతి కుటుంబలాను రూ.5 కోట్లకు పైగా వసూలు చేసి పత్తా లేకుండా పరారయ్యాడు. బాధితులు దమ్మపేట పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు స్తానికంగా నివాసం వుండే చవ్వా రాజు (హంక్ రాజు) అనధికారంగా చిట్టీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ప్రజల్లో నమ్మకం కలిగించి అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు వసూలు చేసాడు. నూటికి ఆరు రుపాయల వడ్డీ ఇస్తూ వుండటంతో మధ్య తరగతి వారు ఆకర్షితులై లక్షలు రుపాయలు ఇచ్చారు. ఖరీదైన భవంతి కారు అతని ఆడంబరం చూసి వ్యాపారస్తులు ఇరవై, ముప్పై లక్షలు వడ్డీలకు ఇచ్చారు. కొద్ది కాలం చెల్లింపులు చేసి భారీగా వసూళ్ళు చేసి పత్తా లేకుండా పొయాడు. రాజు కనిపించకపోవడం సెల్ ఫోన్ స్విచాప్ చేయడంతో మోసపోయామని గ్రహించి బాధితులు పొలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు స్వీకరించిన ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి నిందుతుడు కోసం గాలిస్తున్నారు.