క్రైమ్/లీగల్

కూలీల చేతిలో కొండచిలువ హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర నవంబర్ 5: మండల పరిధిలోని దిడుగుపాడు గ్రామంలోని పొలాలలోవున్న కొండచిలువను కూలీలు చంపివేశారు. రైతుసమన్వయ సమితి మండల కన్వీనర్ యన్నం కోటేశ్వరరావు పొలంలో కూలీలు సోమవారం పత్తి తీసేందుకు వెళ్ళారు. కూలీలు పత్తి తీస్తుండగా సాళ్ళ మధ్యలో ఎనిమిది అడుగుల కొండచిలువ కనిపించడంతో కూలీలు భయభ్రాంతులు గురై కేకలు వేయడంతో పక్క పొలాలలో వున్న రైతులు వచ్చి కొండచిలువను హతమార్చారు. గత ఆగస్టు నెలలో వచ్చిన వరదలకు ఈ కొండచిలువ కొట్టుక వచ్చి వుంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఎనిమిది అడుగుల కొండచిలువను హతమార్చడంతో దానిని చూసేందుకు జనం పెద్ద ఎత్తున వచ్చారు.
కోడ్‌ను ఉల్లఘించిన టీఆర్‌ఎస్ నాయకులపై చర్యలు తీసుకోండి