క్రైమ్/లీగల్

వెంపరాలలో దారుణహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, మార్చి 4: అద్దంకి మండలం వెంపరాల గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ వద్ద బొప్పూడి శ్యాంసన్(45) హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు అద్దంకి సిఐ హైమారావు ఘటనా స్థలానికి వెళ్ళి మృతదేహాన్ని పరిశీలించారు. శ్యాంసన్‌ను శనివారం రాత్రి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హంతకులను పట్టుకునేందుకు ఒంగోలు నుండి జాగిలాలను, వేలిముద్రల సేకరించేందుకు క్లూస్‌టీంను రప్పించారు. హత్యకు గల కారణాలు పూర్తిస్థాయిలో విచారించి హంతకులను త్వరలో పట్టుకుంటామని సీఐ హైమారావు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.