క్రైమ్/లీగల్

విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో శీతలపానీయాల దుకాణం దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి, నవంబర్ 5 : పొదిలి పట్టణంలోని దర్శి రోడ్డుప్రాంతంలో ఒక కూల్‌డ్రింక్‌షాప్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. ఆ షాపు యజమాని ఎస్ నసీరుద్దీన్ ఆదివారం రాత్రి వరకు వ్యాపారం నిర్వహించి తలుపులు మూసేసి ఇంటికి వెళ్ళాడు. అర్ధరాత్రి దాటిన తరువాత షాపులో నుండి మంటల రావటంతో గమనించిన చుట్టుపక్కల వారు యజమానికి సమాచారం అందించారు. ఆయన వచ్చి పోలీసులకు తెలపటంతో ఎస్‌ఐ శ్రీరాం సంఘటన స్ధలానికి చేరుకుని పరిశీలించారు. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పివేశారు. అయితే ఈప్రమాదంలో షాపు పూర్తిగా కాలిపోయింది. దీంతో సుమారు రెండులక్షలరూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈసంఘటన ఏవరైనా దురుద్దేశ్యంతో చేశారా? అన్న అనుమానంతో కూడా సోమవారం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు.