క్రైమ్/లీగల్

గుర్తు తెలియని వృద్ధుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లురూరల్, మార్చి 5: మండలంలోని కసాపురం ఆంజనేయస్వామి ఆలయానికి ఎదురుగానున్న పార్క్‌లో గుర్తుతెలియని వృద్ధుడు క్రిమిసంహారం మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కసాపురం పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దాదాపు 60 సంవత్సరాల వృద్ధుడు ఆదివారం అర్ధరాత్రి సమయంలో క్రిమిసంహారక మందు తాగి మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామాంజినేయులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు
నంబులపూలకుంట, మార్చి 5: మండల పరిధిలోని మర్రికొమ్మదినె్న గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నల్లగుట్టపల్లి గ్రామానికి చెందిన క్రిష్ణమనాయుడు, కుమారుడు అంజనప్పనాయుడులు ద్విచక్ర వాహనంలో ఎన్‌పికుంట వస్తున్న సమయంలో తెల్లవారుజామున గుర్తుతెలియని ట్రాక్టర్ ఢీకొనడంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వీరిని గ్రామస్తులు కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఎస్సై రమేష్‌బాబు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పేకాటరాయుళ్ల అరెస్టు
రామగిరి, మార్చి 5 : రామగిరి సమీపంలో పేకాట స్థావరంపై రామగిరి పోలీసులు దాడులు చేసి 5 మంది జూదరులను అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి రామగిరి సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు వెళ్ళి పేకాట స్థావరంపై దాడులు నిర్వహించామన్నారు. దాడులలో 5 మందిని అరెస్టు చేసి వీరి వద్ద నుంచి రూ.4,230 లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. జూదరులను కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.