క్రైమ్/లీగల్

ట్రాక్టర్ కింద పడి బాలుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, మార్చి 5:బనగానపల్లె పోలీస్‌స్టేషన్ పరిధిలోని యనకండ్ల గ్రామంలో సోమవారం రైతు శ్రీనివాసరెడ్డి ఏకైక కుమారుడు సురేంద్రనాథరెడ్డి(3) ట్రాక్టర్ కిందపడి దుర్మరణం చెందాడు. బంధువులు తెలిపిన ప్రకారం.. శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్‌లో పొలం నుంచి జొన్నచొప్ప తీసుకొచ్చి ఇంటికి సమీపంలోని కళ్లంలో వదలుతున్న సమయంలో ఈ సంఘటన జరిగిందన్నారు. శ్రీనివాసరెడ్డి కుమారుడు సురేంద్రనాథరెడ్డి ఆడుకుంటూ ట్రాక్టర్ టైర్ల వద్దకు వెళ్లాడు. అయితే అక్కడ ఉన్న వారెవరూ ఆ బాలుడిని గుర్తించలేదు. శ్రీనివాసరెడ్డి, మరికొందరు రైతులు ట్రాక్టర్‌పై వున్న చొప్పను తాళ్లతో బిగించి వెనుక్కు లాగుతున్న తరుణంలో ఆగి వున్న ట్రాక్టర్ ముందుకు కదలడం, ట్రాక్టర్ టైరు చిన్నారిపైకి ఎక్కడం క్షణాల్లో జరిగిపోయింది. అనుకోని సంఘటనకు ఆందరూ ఆందోళన చెంది వెంటనే ట్రాక్టర్‌ను పక్కకు తీశారు. అయితే అప్పటికే బాలుడు మృతిచెందాడు. శ్రీనివాసరెడ్డి దంపతులకు వివాహం అనంతరం 12ఏళ్ల తర్వాత కొడుకు పుట్టాడని తెలిపారు. ఈ సంఘటనతో శ్రీనివాసరెడ్డి కుటుంబంతో పాటు స్థానికులు శోకసముద్రంలో మునిగిపోయారు.