క్రైమ్/లీగల్

బస్సుపై బాంబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి విధ్వంసానికి పాల్పడ్డారు. దంతెవాడ జిల్లాలో బస్సుపై బాంబుదాడి చేయడంతో ఒక సీఐఎస్‌ఎఫ్ జవాన్‌తో పాటు మరో నలుగురు మరణించారు. మరో జవాన్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దంతెవాడ జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలోని బచేలి సమీపంలో గురువారం బస్సుపై దాడి జరిగింది. ఈ ప్రాంతంలో ఈ నెల 12వ తేదీన ఈ ప్రాంతంలో సాధారణ ఎన్నికలు జరగనుండటం, 9వ తేదీన ఇదే ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభ కూడా ఉన్న నేపథ్యంలో మావోయిస్టుల చర్య మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికల బందోబస్తుకు వచ్చిన సీఐఎస్‌ఎఫ్ జవాన్లకు నిత్యావసర వస్తువులను ఈ బస్సు ద్వారా కొందరు జవాన్లు తీసుకువెళ్తున్నారనే సమాచారం మేరకే వారు దాడి
చేసినట్లు తెలుస్తోంది. సంఘటనలో జవాన్‌తో పాటు బస్సు డ్రైవర్, కండక్టర్, మరో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా గాయపడ్డ మరో నలుగురిని దంతెవాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టులకు గట్టి పట్టున్న ఈ ప్రాంతంలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునివ్వడం, అందుకు అనుగణంగా పోస్టర్లతో ప్రచారం కూడా నిర్వహించారు. ఈ క్రమంలో గత 15రోజుల్లోనే మావోలు ఈ ప్రాంతంలో మూడు సంఘటనలకు పాల్పడ్డారు. తాజా సంఘటనతో మరింత అప్రమత్తమైన అధికారులు మరిన్ని పోలీస్ బలగాలను ఈ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు మూడురోజుల సమయమే ఉండటం, శుక్రవారమే ప్రధానమంత్రి పర్యటిస్తుండటంతో బందోబస్తును మరింత పటిష్టపరుస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోని బలగాలను కూడా పూర్తిగా అక్కడికి తరలించారు.

చిత్రం..బాంబుదాడిలో ధ్వంసమైన బస్సు, అక్కడికక్కడే మరణించిన వ్యక్తి