క్రైమ్/లీగల్

వీఆర్‌ఓ అక్రమాస్తులు రూ.3 కోట్ల పైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, నవంబర్ 8: ఏకంగా మూడు కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టాడు చిరుద్యోగి అయిన జేజి బాబు. ఆయన ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు. ఏకకాలంలో మూడుచోట్ల సోదాలు జరిగిన అధికారులు పెద్దమొత్తంలో బంగారం, వెండి, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామ వీఆర్‌ఓ జేజి బాబు అక్రమాస్తుల చిట్టా ఇది. ఓ మహిళా రైతు నుంచి లంచం తీసుకుంటూ జేజి బాబు ఏసీబీ అధికారులకు చిక్కాడు. అయితే అతని అక్రమాస్తులపై కనే్నసిన అధికారులు గురువారం సోదాలు నిర్వహించడంతో గుట్టరట్టయింది. వివరాలు ఇలా ఉన్నాయి. గత జూలై 20వ తేదీ పట్టాదారు పాసు పుస్తకం కోసం మహిళా రైతు సుబ్బలక్షమ్మ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్‌ఓ జేజి బాబును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కాగా జేజి బాబు పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టినట్లు
సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు గురువారం ఒకేసారి మూడు చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని విశ్వనగర్‌లో గల వీఆర్‌ఓ జేజిబాబు ఇళ్లు, ఆయన అత్తగారి ఊరైన మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఇంట్లో, హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆయన కూతురు ఇంట్లో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. పెద్దమొత్తంలో బంగారం, నగదు, ప్లాట్లు, గృహాలు, వ్యవసాయ పొలాలు తదితర స్థిర, చారాస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వీటి విలువ సుమారు రూ. 3 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్యాంకు లాకర్లు ఇంకా తెరవాల్సి ఉంది. రాత్రి పొద్దుపోయేంత వరకు తనిఖీలు కొనసాగాయి. ఏసీబీ డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో మూడు బృందాలు విడివిడిగా సోదాలు నిర్వహించాయి.

చిత్రం..జేజిబాబు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు