క్రైమ్/లీగల్

బెట్టింగ్, గ్యాంబ్లింగ్ పరిధిలోకి లాటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 8: లాటరీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ పరిధిలోకి వస్తుందని ముంబయి హైకోర్టు ప్రకటించింది. రాష్ట్రంలో లాటరీ అమ్మకాలపై మహారాష్ట్రప్రభుత్వం పన్నులను విధించడాన్ని సమర్థిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మహారాష్ట్ర పన్నులు, లాటరీ చట్టం 2006ను సవాలు చేస్తూ మంగళ్ మూర్తి మార్కెటింగ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌సీ ధర్మాధికారి, జస్టిస్ భారతి డాంగ్రే ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఈ ఏజన్సీ అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ ప్రభుత్వాలు నిర్వహిస్తున్న లాటరీల అమ్మకానికి సబ్ డిస్ట్రిబ్యూటర్‌గా పని చేస్తున్నారు. లాటరీలపై అమ్మకం పన్నును విధించడాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహారాష్ట్రప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం రాష్ట్రంలో లాటరీ అమ్మకాలపై పన్నును విధించవచ్చును. పైగా ప్రమోటర్ ముందుగా పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కోర్టులో పిటిషనర్ తరఫున న్యాయవాది పీఎస్ రామన్ వాదనలు వినిపిస్తూ ఇతర రాష్ట్రాల లాటరీలు ఇక్కడ విక్రయిస్తే పన్నులను విధించడం సబబుకాదని పేర్కొన్నారు. ఇప్పటికే పార్లమెంటు లాటరీ నియంత్రణ చట్టం 1998 తెచ్చిందన్నారు. అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి వాదనలు వినిపిస్తూ ఈ చట్టాలు లాటరీలనియంత్రణకు ఉద్దేశించినవని, అమ్మకం పన్ను విధించే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పారు.