క్రైమ్/లీగల్

రూ.7.51 కోట్ల సొమ్ము పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదరాబాద్, నవంబర్ 8: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు తరలింపుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు. మూడు ప్రాంతాల్లో వాహనాల్లో తరలిస్తున్న రూ. 7.51 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన మీడియా సమావేశంలో సీపీ అంజనీ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. స్థానిక పోలీసులు, టాస్క్ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో కారులో నవీన్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త అశీష్ కుమార్ అహుజా తరలిస్తున్న రూ. 2 కోట్లు సైఫాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని ఐటీ శాఖకు పంపించారు.
బంజారాహిల్స్ గ్రీన్ కాలనీ ప్రాంతంలో నవీన్‌నగర్ ప్రాంతానికే చెందిన సనిల్ కుమార్ అహుజా కారులో తరలిస్తున్న రూ. 5. 47 కోట్లను బంజారాహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోషామహల్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త బాబుత్ సింగ్ రాజ్ పురోహిత్ వద్ద రూ. 3.5 లక్షలు షాహినాథ్‌గంజ్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నగదు ఎవరిది, ఎక్కడి నుంచి ఎక్కిడికి తీసుకెళ్తున్నారు అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది హవాలా సొమ్ము అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున పెద్దమొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సంబంధించిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. లేకపోతే తనిఖీల్లో దొరికిన నగదు సీజ్ చేయడం జరుగుతుందని అంజనీకుమార్ తెలిపారు. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు పంపిణీ చేసే అవకాశం ఉన్నందునే ఈసీ ఈ చర్యలు చేపట్టింది. ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ ఆధారాలు చూపని సొమ్మును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా ఉండగా నగరంలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీసులు గత నెల రోజులుగా దాదాపు రూ. 16 కోట్లకుపైనే నగదును స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ పీ.విశ్వప్రసాద్, సైఫాబాద్ ఇన్స్‌పెక్టర్ సీహెచ్ సైది రెడ్డి, నగర టాస్క్ఫోర్స్ అధికారులు, సిబ్బందిని అంజనీ కుమార్ అభినందించారు.
చిత్రం..వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ నగదు వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న పోలీసు కమిషనర్ అంజనీ కుమార్