క్రైమ్/లీగల్

మోటారు సైకిళ్ళ దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట) నవంబర్ 9: పార్కింగ్ చేసి ఉన్న మోటార్ సైకిళ్లను దొంగిలిస్తున్న నిందితుడుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు అర్బన్ సిసియస్ అడిషనల్ ఎస్పీ శ్రీరాఘవ తెలిపారు. శుక్రవారం సిసియస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలను శ్రీరాఘవ వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీరాఘవ మాట్లాడుతూ అడవి తక్కెళ్లపాడు రాజీవ్ గృహ కల్ప అపార్ట్‌మెంట్‌కు చెందిన షేక్ అల్లాబక్షు, కొరిటపాడు హనుమయ్య నగర్‌కు చెందిన ముత్తుకూరి సాయిరామ్‌లు ఇరువురు నగరంలో చెడు అలవాట్లకు గురై డబ్బులు సరిపడక పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను తస్కరించి వాటిని విక్రయించుకుని వాటితో వచ్చే డబ్బుతో జల్సాలు చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలో నల్లపాడు, లాలాపేట, పెదకాకాని, తాడికొండ, పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మోటార్ వాహనాలను తస్కరించారు. నగరంలో బైక్ దొంగతనాల కేసులు ఎక్కువుగా నమోదు అవడంతో అర్బన్ ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు సిసియస్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టడంతో శుక్రవారం అరండల్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో బైక్‌ల పార్కింగ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న అల్లాబక్షును అదుపులోకి తీసుకుని విచారిచంగా నేరం అంగికరించడంతో అతిని వద్ద నుంచి 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు శ్రీరాఘవ తెలిపారు. వాటి విలువ 6 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు సాయిరామ్ పరారీలో ఉన్నాడని అతన్ని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని శ్రీ రాఘవ తెలిపారు. పై ముద్దాయిలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిసియస్ సిఐలు సుబ్రహ్మణ్యం, సురేష్‌బాబు, నల్లపాడు సిఐ బాలమురళీకృష్ణ, సిసియస్ సిబ్బంది కోటేశ్వరరావు, అనీల్‌కుమార్, శ్రీనివాసరావు, విజయ్, ఐటి కోర్ టీం బాలాజీలను ఎస్పీ రివార్డుల కోసం సిఫార్స్ చేసినట్లు శ్రీ రాఘవ తెలిపారు.