క్రైమ్/లీగల్

ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించడంపై ఐజీతో ఎస్పీ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 9: ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించి, స్మగ్లర్ల ఆట కట్టించడంపై టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావుతో తిరుపతి పోలీస్ అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ శుక్రవారం చర్చలు జరిపారు. అర్బన్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అన్బురాజన్ స్థానిక కపిలతీర్థం సమీపంలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో ఐజీ కాంతారావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ ఏఎస్పీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రైలు కింద పడి ఒకరు మృతి

తిరుపతి, నవంబర్ 9: తిరుపతి-చంద్రగిరి మార్గమధ్యంలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు. మృతుడు ఎవరన్నది తెలియడం లేదు. ఇతను ఆత్మహత్యకు పాల్పడ్డాడా, లేక ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడి దుర్మరణం చెందాడా అనేది తెలియడంలేదు. మృతునికి సంబంధించిన సమాచారం తెలిసినవారెవరైనా 7799122229 నెంబర్‌కు, 8500049899 నెంబర్‌కు తెలియజేయాలని రైల్వే స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.

తమిళనాడులో హత్య చేసి... నగరిలో పూడ్చి పెట్టారు

నగరి, నవంబర్ 9: ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. తాము హత్య చేసిన విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు తమిళనాడులో హత్య చేసిన వ్యక్తి మృతదేహాన్ని ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులోని నగరి సమీపంలోని కుశస్థలి నదిలో పూడ్చిపెట్టి వెళ్లిపోయారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడటంతో హత్య జరిగిన 10 రోజుల తరువాత శుక్రవారం నిందితుల సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. వివరాల్లోకి వెడితే తమిళనాడు ఆర్కేపేట మండలం ఆర్బీ కండ్రిగకు చెందిన కరుణామూర్తి (30)కి, వల్లత్తూరుకి చెందిన హరిబాబు మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయి. వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదంలో కరుణామూర్తిని ఆర్కేపేట వద్ద ఉన్న మామిడితోటలో హరిబాబు తన అనుచరులుతో కలిసి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని తమిళనాడు రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోని నగరికి తీసుకువచ్చి బుగ్గ అగ్రహారం వద్ద ఉన్న కుశస్థలి నదిలో పూడ్చిపెట్టి వెళ్లిపోయారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన తమిళనాడు పోలీసులు విచారణలో వాస్తవాలు వెలుగుచూశాయి. హరిబాబును, అతని అనుచరులను అరెస్టు చేసి వారిచ్చిన సమాచారం మేరకు కుశస్థలి నదిలో పూడ్చిపెట్టిన కరుణామూర్తి మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే అప్పటికే చీకటిపడటంతో శనివారం పంచనామా నిర్వహించనున్నట్లు సీఐ మల్లికార్జున తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు
* 5,411 కేసులు నమోదు
* డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పదిమందికి జైలుశిక్ష
* ఎస్పీ విక్రాంత్‌పాటిల్

చిత్తూరు, నవంబర్ 9: జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనాల తనిఖీలు చేశారు. నిబంధనలు అతిక్రమించినందుకు 5,411 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. డ్రంక్‌డ్రైవ్ కింద 424 కేసులు నమోదు చేయగా, అందులో పది మందికి జైలుశిక్ష కూడా పడినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈనెల 1వ తేది నుంచి శుక్రవారం వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టామన్నారు. లైసెన్సు లేకనే వాహనాలు నడుపుతున్న 898 మంది, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన 2,760మంది, ట్రిబుల్ రైండింగ్ 509, రికార్డులు లేని వాహనాలు 532, సీటుబెల్టు ధరించకుండా వాహనాలు నడుపుతున్న 334మంది, లైసెన్సు తదితర వివరాలు సక్రమంగా లేని వాహనాలపై కూడా కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఇకపై జిల్లా వ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులతో పాటు వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వాహనాలు తనిఖీ కార్యక్రమాన్ని ముమ్మరం చేసామని వాహన యజమానదారులు విధిగా రికార్డులతోపాటు నియమ నిబంధనలతో వాహనాలు నడపాలని ఎస్పీ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు.