క్రైమ్/లీగల్

మేయర్ దంపతుల హత్య కేసులో ముద్దాయి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, నవంబర్ 9: చిత్తూరు నగర పాలక సంస్థ మేయర్ కఠారి అనూరాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ల దారుణ హత్య కేసులో ముద్దాయి అయిన శ్రీనివాసాచారిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీ ఐ శ్రీ్ధర్ తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 2015 నవంబర్ 17వ తేదిన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ అనూరాధతో ఆమె భర్త కఠారి మోహన్ దారుణ హత్యకు గురయ్యారు. హత్య కేసు విచారణలో భాగంగా ప్రధాన నిందితుడు అయిన చింటూతోపాటు మరో 23మందిపై చార్జిషీటు దాఖలు చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో సాక్షుల విచారణకు జిల్లా 9వ అదనపు జడ్జి కపర్థి గతనెల 29వ తేది నుంచి ఈనెల 5వ తేది వరకు షెడ్యూల్‌ను ప్రకటించారన్నారు. ఈనెల 29న కేసు విచారణలో భాగంగా 21 నిందితుడు అయిన శ్రీనివాసాచారి కోర్టుకు హాజరు కాకపోవడంతోపాటు ముద్దాయి తరపున న్యాయవాది కూడా గైర్హాజరుకు సంబంధించి పిటీషను దాఖలు చేయలేదన్నారు. జడ్జి ఈ కేసు షెడ్యూల్‌ను రద్దు చేస్తూ అదే రోజు ముద్దాయి శ్రీనివాసాచారిపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసారన్నారు. ముద్దాయి అయిన శ్రీనివాసాచారి కోసం గాలించగా కర్నాటక రాష్ట్రం చింతామణిలో ఉన్నట్లు సమాచారం రావడంతో శుక్రవారం అతనిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. తదుపరి ముద్దాయిని చిత్తూరు కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.