క్రైమ్/లీగల్

మహిళ హత్యకేసులో నిందితుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 9: నగరంలోని కుమ్మరవీధికి చెందిన షేక్ తహసీన్ అనే మహిళను హత్య చేసిన కేసులో నిందితులను శుక్రవారం చిన్నబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ వివరించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక కుమ్మరవీధికి చెందిన షేక్ తహసీన్ (34) విద్యావంతురాలు. తన దగ్గరున్న నగదును వడ్డీలకు ఇస్తూ, చీటీలు నిర్వహిస్తూ జీవనం సాగించేది. ఈ క్రమంలో ఆమె వద్ద వడ్డీకి నగదు తీసుకున్న షేక్ కాలేషా వడ్డీతో కలిపి రూ.4 లక్షల వరకు బాకీ పడ్డాడు. అదేవిధంగా ఇనాయతుల్లా, సాదిక్, ఫర్జాలీ కూడా ఆమెకు బాకీ ఉన్నారు. పూజలు, తాయెత్తులు కట్టే సాదిక్‌తో కలిసి అందరూ తహసీన్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 22న దైవభక్తి ఎక్కువగా ఉన్న తహసీన్‌కు తన ఇంట్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని, వస్తే మంచి జరుగుతుందని సాదిక్ సమ్మబలికాడు. దర్గామిట్టలో ఉన్న సాదిక్ ఇంటికి వెళ్లిన ఆమెకు సైనేడ్ కలిపిన జిలేబిని ప్రసాదమని ఇవ్వగా ఆమె తిన్న వెంటనే అస్వస్థతకు గురైంది. ఆమె చనిపోలేదని భావించి ఆమె గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని వెంకటాచలం మండంలోని అటవీ ప్రాంతంలో పూడ్చివేశారు. ఈ కేసు గురించి డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించి చిన్నబజార్ సిఐ అబ్దుల్‌సుభాన్, ఎస్సై కరీముల్లా నిందితుల్లో ఇనాయతుల్లా, కాలేషా, ఫర్జాలీలను శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో సిఐ అబ్దుల్ సుభాన్, ఎస్సై కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.