క్రైమ్/లీగల్

కొత్తపేటలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల టౌన్, నవంబర్ 9: వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీలోని ఆర్టీసీ కాలనీలో దొంగతనం జరిగిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. టూటౌన్ సీఐ రామారావు కథనం ప్రకారం బ్యాంకు విశ్రాంత ఉద్యోగి తాడికొండ రాఘవరావు ఈనెల 3న కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో నివాసముంటున్న తన కుమారుడు ఇంటికి వెళ్లాడు. ఇంటి పనిచేసే లక్ష్మికి ఇళ్లును జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బయలుదేరి వెళ్లాడు. గురువారం రాత్రి ఇంటి తలుపు పగులగొట్టి దొంగలులోనికి ప్రవేశించినట్లు పనిమనిషి లక్ష్మి రాఘవరావుకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న రాఘవరావు హుటాహుటీన శుక్రవారం చీరాలకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు సవర్ల బంగారు ఆభరణాలు, 2.5కేజీల వెండి ఆభరణాలు, రూ.15వేల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒంగోలు నుంచి వేలిముద్ర నిపుణులను రప్పించి వేలిముద్రలను సేకరించారు. సంఘటనా స్థలానికి సీఐ రామారావు, ఏఎస్సై ఆంజనేయులు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సీఐ తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులో 17 మంది వాహన చోదకులకు జైలు శిక్ష
ఒంగోలు, నవంబర్ 9: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులో మొత్తం 17 మంది వాహన చోదకులకు కోర్టు జైలుశిక్ష విధించినట్లు ఒంగోలు ట్రాపిక్ పోలీసు స్టేషన్ డిఎస్‌పి వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. ప్రకాశం జిల్లా వాసులలో కొందరు మద్యం సేవించి వాహనాలను నడిపి ప్రమాదాల పాలు అవుతన్నారన్నారు. దాని వలన జరిగే ప్రాణ, వ్యక్తిగత, ఆస్తి నష్టాలను అరికట్టాలనే ఉద్దేశ్యంతో, జిల్లా ఎస్‌పి బి సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసు అధికారులు వారి వారి ఇలాఖా లోని ప్రదేశాలలో ఈనెల 2 నుండి 9వ తేదీ వరకు వాహన చోదకులకు డ్రంకన్ డ్రైవ్ పై తనిఖీలు నిర్వహించారని డి ఎస్‌పి తెలిపారు. ఆ తనిఖీలలో 141 మందిని మద్యం సేవించి వాహనము నడుపుతున్న వారిగా గుర్తించి, వారి పై ఎంవి యాక్ట్ సెక్షన్ 185 (ఎ) ప్రకారము కేసులు నమోదు చేసినట్లు డిఎస్‌పి తెలిపారు.వారితోపాటుగా పెండింగ్ లో వున్న 60 మందిని కోర్టు నందు హాజరు పరచగా, 17 మంది వాహన చోదకులకు జైలు శిక్ష , మిగిలిన వారికి జరిమానా విధించినట్లు డిఎస్‌పి తెలిపారు. ఈ డ్రంకన్ డ్రైవ్ కేసులో మొత్తం 89వేల 100 కోర్టు వారు జరిమానాగా విధించినట్లు డిఎస్‌పి తెలిపారు.

నల్లమల ఘాట్ రోడ్డులో ప్రమాదం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 20 మందికి గాయాలు
పెద్దదోర్నాల, నవంబర్ 9: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటన నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం - పెద్దదోర్నాల మధ్య ఘాట్‌రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగింది. దోర్నాల నుండి రాయదుర్గం వెళ్తున్న శ్రీశైలం బస్సు, శ్రీశైలం నుండి మార్కాపురం డిపోకు చెందిన బస్సు మార్గమధ్యంలోని శిఖరం వద్ద ఢీకొనడంతో రాయదుర్గం వెళ్తున్న బస్సులో ప్రయాణికులకు సుమారు 20 మందికి గాయాలు అయ్యాయి. రాయదుర్గం బస్సు డ్రైవర్ ఎం రాముడు, కె కుమార్, రాజేష్, యోగీశ్వర్, వై రాజ్, అపర్ణ, వెంకటేశ్వర్లు, రామకోటయ్య, సుబ్బులు, గురవమ్మ తదితరులకు గాయాలు కాగా, వారిని వైద్య చికిత్స నిమిత్తం 108లో కర్నూలు జిల్లా సుండిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.