క్రైమ్/లీగల్

భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తకు జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 9: కట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేయడంతోపాటు ఆమె ఆత్మహత్యకు కారణమైన భర్తకు ఏడు సంవత్సరాలు జైలుశిక్ష విధిస్తూ ఐదో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. పెనమలూరు పోలీస్టేషన్ పరిధిలోని పప్పులమిల్లు ప్రాంతానికి చెందిన సలూజ అనే యువతికి మాచవరానికి చెందిన కోనేరు వరుణ్‌కుమార్‌తో 2010లో పెళ్లయింది. ఆతర్వాత దంపతులు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. కొంతకాలం తర్వాత భార్యను వేధింపులకు గురి చేయడంతోపాటు 2010 డిసెంబర్ 14వ తేదీన ఆమె పెనమలూరులోని తల్లి వద్దకు వచ్చేసింది. తీవ్ర మనస్తాపానికి గురైన సలూజ అదేరోజు మధ్యాహ్నాం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టిన మీదట నిందితుడైన భర్త వరుణ్‌కుమార్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరుఫున పోలీసులు ప్రవేశపెట్టిన 12మంది సాక్షులను విచారించిన మీదట నిందితునిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.