క్రైమ్/లీగల్

అక్రమ ఫైనాన్స్, చిట్టీల నిర్వహకుడు సదానందం అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, నవంబర్ 9: అక్రమంగా ఫైనాన్స్, చిట్టీ వ్యాపారం నడిపిస్తున్న మేర్గు సదానందం(40)ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఈమేరకు శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్‌లో ఆయన ఇంటిపై టాస్క్ ఫోర్స్ సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు జరిపి సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వద్ద తొమ్మిది బ్లాంక్ చెక్కులు, రెండు చిట్టి బుక్కులు పెద్దవి, నాలుగు చిట్టి బుక్కులు చిన్నవి, 35 ప్రామిసరీ నోట్లు, 12 రెవిన్యూ స్టాంప్‌లతో సంతకాలు చేసిన సాదా పేపర్లు, రూ.3,46,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటిని స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్య కోసం సిరిసిల్ల పోలీసులకు అప్పగించారు. ఈ దాడులు యథాతధంగా కొనసాగుతూనే ఉంటాయని, కనుక ఇప్పటికైనా అక్రమ వడ్డీ వ్యాపారులు, చిట్ ఫండ్ వ్యాపారులు తమ పద్దతి మార్చుకోకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.