క్రైమ్/లీగల్

మోసగించిన కేసులో ఐదేళ్ల జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 9: పెళ్ళి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకొని అనంతరం పెళ్ళికి కులం అడ్డువస్తుందని తప్పించుకున్న నిందితుడికి ఐదేళ్ళ కఠిన కారాగారశిక్ష విధిస్తూ శుక్రవారం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కో ర్టు న్యాయమూర్తి భరతలక్ష్మి తీర్పునిచ్చారు. చెన్నూర్‌కు చెందిన అట్టం లక్ష్మినారాయణ జైలు వార్డెన్‌గా పనిచేస్తూ హైదరాబాద్‌లో చదువుకుంటున్న కళాశాల వి ద్యార్థినితో పరిచయం పెంచుకొని పెళ్ళి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబర్చుకోవడమేకాక తన కోరిక తీర్చుకున్నాడు. పెళ్ళి ప్రస్తావన రాగానే తప్పించుకుని తిరుగుతున్న లక్ష్మినారాయణ మోసాలపై బాధితురాలు 2011 నవంబర్ 8న ఫిర్యాదు చేయగా నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఏఎస్పీ ఎం.విజయ్‌కుమార్ దర్యాప్తు నివేదిక సమర్పించగా పిపి రమణారెడ్డి 14 మంది సాక్షులను ప్రవేశపెట్టగా కోర్టులో నేరం రుజువు కావడంతో లక్ష్మినారాయణకు ఐదేళ్ళ జైలుశిక్షతోపాటు రూ. లక్షా 5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు