క్రైమ్/లీగల్

నేనెక్కడికీ పారిపోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: మూడు రోజులపాటు అడ్రస్ లేకుండాపోయిన గనుల వ్యాపారి గాలి జనార్దన్‌రెడ్డి శనివారం బెంగళూరు క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ప్రత్యక్ష మయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారికి లంచం ఇవ్వచూపాడన్న అభియోగాన్ని ఎదుర్కొంటున్న గాలి తనపై వచ్చినవన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. తన అడ్వొకేట్‌లతో కలిసి కారులో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు ఆయన చేరుకున్నారు. అంతకుముందు తాను పోలీసులు ఎదుట హాజరవుతానంటూ ఓ వీడియో మెసేజ్ పంపారు. క్రైమ్ బ్రాంచ్‌కు చేరుకున్న గాలి ‘నేను ఎక్కడికీ పారిపోలేదు’ అని అన్నారు. తనపై మోపిన ఆరోపణలు రాజకీయ కుట్రలోభాగమని ఆరోపించారు. పోలీసులపై తనకు నమ్మకం ఉందని గాలి అన్నారు. అంతకు ముందు వీడియో సందేశంలో ‘నేను నగరం విడిచి ఎక్కడికీ వెళ్లలేదు. నాకు పారిపోవల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చారు. ‘నేను ఎలాంటి తప్పుచేయలేదు. తప్పుచేసినట్టు పోలీసులు చిన్న డాక్యుమెంట్ కూడా చూపలేదు’ అని జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మీడియాను కొందరు తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీవీ చానల్స్‌లో గాలి వీడియో
మెస్సెజ్ ప్రచారం అయింది. బీజేపీ కేబినెట్‌లో గాలి జనార్దన్‌రెడ్డి మంత్రిగా పనిచేశారు. ఎఫ్‌ఐఆర్‌లోగాని, తనకు జారీ చేసిన నోటీసులోగాని తనపేరు ఎక్కడా లేదని ఆయన వివరించారు. తాను తప్పచేసినట్టు సాక్ష్యాధారాలు లేవన్న ఆయన శనివారం పోలీసుల నుంచి నోటీసులు అందాయని తెలిపారు. అంబిడెంట్ అనేక కంపెనీని కాపాడేందుకు అధికారికి లంచం ఇచ్చారని ఆయనపై ఆరోపణలు. కాగా పోలీసుల విచారణకు సహకరిస్తానని గాలి ప్రకటించారు. ప్రజలకు వాస్తవాలేమిటో చెప్పాలన్న ఉద్దేశంతోనే వీడియో విడుదల చేసినట్టు గనుల వ్యాపారి చెప్పారు. కోట్లాది రూపాయల లంచం కేసులో గాలిపేరు బయటపడడంతో బుధవారం నుంచి పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.