క్రైమ్/లీగల్

సోషల్ వెల్ఫేర్ డీడీ ఇళ్లలో సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 10: సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ దాసరి మధుసూధన్‌రావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం నెల్లూరు నగరంలోని ఆయన నివాసంతో పాటు గుంటూరు, ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్‌లలోని ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.కోటి మేర ఆస్తులను ఆయన కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.10కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నెల్లూరు జిల్లా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరక్టర్‌గా ఉన్న మధుసూధన్‌రావు నెల కిందట తూర్పు గోదావరి జిల్లాకు డిప్యూటీ డైరక్టర్‌గా బదిలీ అయ్యారు. అయితే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ డైరక్టర్ తన స్థానం నుండి రిలీవ్ కాకపోవడంతో ప్రస్తుతం ఆయన ఉద్యోగ బాధ్యతలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారు. ఫిర్యాదులు అందడంతో ఏసిబి అధికారులు ఆయన ఆస్తులకు సంబంధించి సోదాలు నిర్వహించారు. నెల్లూరు ఏసిబి డి ఎస్పీ సిహెచ్‌డి శాంతో ఆధ్వర్యంలో ఐదు బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. మధుసూధన్‌రావును అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు డి ఎస్పీ శాంతో తెలిపారు.
గుర్తించిన ఆస్తుల వివరాలు:
* మధుసూధన్‌రావు పేరుపై హోండా ఎసెంట్, మారుతి స్విఫ్ట్ కార్లు
* మధుసూధన్‌రావు భార్య చంద్రిక పేరుపై ఉన్న ఆస్తులు
* గుంటూరు నగరం కొరిటెపాడులో జిప్లస్‌వన్ నివాస సముదాయం
* గుంటూరు పాండురంగనగర్‌లో ఇల్లు
* గుంటూరు నగరంలో రెండు ఇళ్ల స్థలాలు, గుంటూరు జిల్లాలోని
కాజ, గోరంట్ల, వెనిగండ్ల ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు
* నెల్లూరులోని ఇంట్లో రూ.లక్ష నగదు
* 750 గ్రాముల బంగారు ఆభరణాలు
* ఒకటిన్నర కేజీ వెండి వస్తువులు.