క్రైమ్/లీగల్

గాలి జనార్దన్‌రెడ్డి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, నవంబర్ 11: మాజీ మంత్రి, ఓబుళాపురం గనుల యజమాని గాలి జనార్దన్ రెడ్డిని కోట్లాది రూపాయల9 పోంజీ స్కాం కేసులో బెంగళూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేవారు. ఈ కేసులో ఆరోపణలు వచ్చినప్పటి నుంచి గాలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు, అనంతరం శనివారం గాలి జనార్దన్ రెడ్డి సెంట్రల్ క్రైమ్ బ్రాంచికి వచ్చి లొంగిపోయారు. ఆదివారం ఉదయం వరకు గాలి జనార్దన్ రెడ్డిని పోలీసులు విచారించారు. అనంతరం ఈ కేసులో వచ్చిన అభియోగాలపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసినట్లు అదనపు కమిషనర్ (క్రైమ్స్) అలోక్‌కుమార్ చెప్పారు. అనంతరం గాలిని ఆరవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. గాలికి ఈ నెల 24వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. కోట్లాది రూపాయల సొమ్మును ప్రజలు పెట్టుబడి పెట్టిన పోంజి స్కీం నిర్వాహకులు అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు రాగా, వీరితో కలిసి అక్రమ లావాదేవీలు చేసినట్లు గాలిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో బెంగళూరు నగర క్రైం బ్రాంచి పోలీసులు గాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి గాలి అదృశ్యమయ్యారు. శనివారం గాలి పోలీసుల వద్దకు వచ్చికి లొంగి పోయిన తర్వాత రాత్రంతా విచారించారు. క్రైమ్ బ్రాంచి ఆఫీసులోనే పొద్దుపోయిన తర్వాత నిద్రపోయినట్లు పోలీసులు చెప్పారు. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచకముందు గాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గాలి పరారీలో ఉన్నట్లు సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు కర్నాటక, తెలంగాణ, ఆంధ్రాలో గాలి కోసం ముమ్మరంగా ఆయనకు సంబంధించి ఇండ్లలో సోదాలు నిర్వహించారు. అనంతరం గాలి అడ్వకేట్లతో వచ్చి నాటకీయ పరిణామాల మధ్య పోలీసులకు లొంగి పోయారు. తనపై వచ్చిన అభియోగాల్లో నిజంలేదని, ఇదంతా పోలీసుల కుట్ర అన్నారు. సెషన్స్ కోర్టులో బెయిల్ తీసుకోవడం వల్ల గాలి అనుచరుడు అలీ ఖాన్‌ను పోలీసులు సాంకేతిక కారణాల వల్ల అరెస్టు చేయలేకపోయారు. అంబిడాంట్ మార్కెటింగ్ సంస్థ యజమాని అహ్మద్ ఫరీద్, గాలికి మధ్య రూ.20 కోట్ల ఒప్పందం ఖరారయ్యేందుకు అలీఖాన్ సూత్రధారిగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. పోంజీ స్కీంను అంబిడాంట్ సంస్థనిర్వహించింది. ఈ స్కాంనుంచి బయటపడేందుకు రూ.20 కోట్లు ఇవ్వాలని గాలి డిమాండ్ చేసినట్లు అభియోగం. ఈ కేసులో చిక్కుకోకుండా ఉండాలంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లంచం ఇవ్వాల్సి ఉంటుందని గాలి అంబిడాండ్ నిర్వాహకులకు చెప్పినట్లు సమాచారం. సీసీబీ పోలీసులకు లొంగిపోయే ముందు గాలి వీడియో ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు. తాను పరారీలో లేనని, నగరంలో ఉన్నానని, తనకు పరారీ కావాల్సిన అవసరం లేదని ఆ సందేశంలో గాలి చెప్పారు. ఈ కేసుకు రాజకీయ కోణం లేదని పోలీసులు చెప్పారు. ఈ కేసును తాము 20 రోజులుగా దర్యాప్తుచేస్తున్నామని వారు చెప్పారు. రాజకీయం చేయకుండా ఉండేందుకు తాము బళ్లారి ఉప ఎన్నిక నవంబర్ 3 వరకు వేచి చూశామని పోలీసులు చెప్పారు. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి 2011లో అక్రమమైనింగ్ కేసులో అరెస్టయ్యారు. అనంతరం ఆయనకు మూడేళ్ల క్రితం బెయిల్ వచ్చింది. తాను తనను పోంజీ స్కాం నుంచి రక్షించేందుకు రూ.20 కోట్లు ఇవ్వాలని గాలి కోరారని, ఆ సొమ్మును చెల్లించానని అంబిడాండ్ నిర్వాహకుడు ఫరీద్ పోలీసులకు చెప్పడంతో ఈ స్కాం బహిర్గతమైంది.