క్రైమ్/లీగల్

రెండు చిరుతపులి చర్మాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంపచోడవరం, నవంబర్ 12: రంపచోడవరం అటవీ శాఖ అధికారులు రెండు సిందుగ (చిరుత పులి) చర్మాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రంపచోడవరం అటవీ శాఖ రేంజర్ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..తమకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు రంపచోడవరం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న కళ్లి సత్తిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా లభించిన సమాచారం మేరకు రంపచోడవరం మండలం కొత్తపాకలు గ్రామంలో ఒక ఇంట్లో ఉన్న సిందుగ చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ పరిసరాల్లో అనుమానంగా సంచరిస్తున్న ముగ్గురిపై అనుమానం వచ్చి వారిని కూడా అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో మారేడుమిల్లి మండలం గుర్రమామిడి గ్రామంలోని చేను మకాలంలో దాచిన మరొక సిందుగ చర్మాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోనికి తీసుకున్న సత్తిరెడ్డి, వెంకటరెడ్డి, సుగ్గిరెడ్డి, భీమారెడ్డిలపై కేసు నమోదుజేసి కోర్టుకు హాజరుపరుస్తామని రేంజర్ సునీల్ తెలిపారు. ఈ దాడుల్లో అటవీ శాఖ అధికారులు భాస్కరరావు, హరీశ్వర్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
యువకుడు అనుమానాస్పద మృతి
ఐ పోలవరం, నవంబర్ 12: జీ ములపొలం గ్రామంలో రొయ్యలు చెరువులు వద్ద పనిచేస్తున్న ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఐ పోలవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జీ మూలపొలం గ్రామానికి చెందిన గుత్తాల మణికంఠస్వామి (22) చెరువుల వద్ద ఉన్న ఒక తాటాకు పాకలో ఉరివేసుకుని మృతి చెందినట్లు ఎస్సై దుర్గాశేఖర్‌రెడ్డి తెలిపారు. అయితే స్థానిక ఎస్సీ నాయకులు మట్టా గగనవీరుడు, వడ్డీ గౌతమ్, రేవు శ్రీను ఆధ్వర్యంలో యువకుడి మృతి అనుమానాస్పదంగా ఉందని, ఎవరో కావాలనే ఆత్మహత్యగా చిత్రికరించారని ఆరోపించారు. ఘటనాస్థలానికి క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించాలని మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, ఎస్సీ నాయకులు పోలీసులను డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు క్లూస్ టీమ్‌ను రప్పించి ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ఘటనపై క్లూస్ టీమ్ సేకరించే ఆధారాలను బట్టి కేసు దర్యాప్తు చేస్తామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై దుర్గాశేఖర్‌రెడ్డి తెలిపారు.