క్రైమ్/లీగల్

తిరుపతి బాలికల పరిశీలన గృహ సూపరింటెండెంట్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుపతిలోని సరోజినీదేవి లే ఔట్‌లో ఉన్న ప్రభుత్వ బాలికల పరిశీలన గృహంలోని ఓ అనాథ బాలికపై గత కొనే్నళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో పరిశీలనాగృహం సూపరింటెండెంట్ నందగోపాల్ (58)ను సోమవారం ఉదయం తిరుపతి వెస్ట్ డీఎస్పీ కనకరాజు ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసులు అరెస్టు చేశారు. సోమవారం ఆయన్ను మూడవ అదనపు జూనియర్ సీవిల్ జడ్జి ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్‌కు ఆదేశిస్తూ, ఈనెల 23వ తేదీకి వాయిదా వేశారు. నందగోపాల్ తమకు తండ్రిలాంటి వాడని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పరిశీలనాగృహంలోని నలుగురు విద్యార్థినులు చేతిపై కోసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, సీడబ్ల్యుసీ కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. గాయపడ్డ విద్యార్థినులకు ప్రథమ చికిత్స అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో నందగోపాల్‌ను కఠినంగా శిక్షించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక కొర్లగుంట జంక్షన్ వద్ద ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య ఆధ్వర్యంలో ఆర్‌డిఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలిక వసతి గృహం వద్ద ధర్నా చేశారు. స్థానిక ప్రభుత్వ బాలుర పరిశీలనా గృహంలోని అమీన అనే బాలిక తనపై నందగోపాల్ గత కొనే్నళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ కడప జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కడప పోలీసులు కేసు నమోదు చేసినా తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. దీంతో నందగోపాల్‌పై సోమవారం ఉదయం పోస్కో చట్టం కింద 372(2)డి (ఎన్), 376/సి(సి) ఐపీసీ 5, 5డి కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను తిరుపతి మూడువ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కేసు విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేశారు. కాగా ప్రభుత్వ బాలికల పరిశీలనా గృహం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నందగోపాల్‌కు అనుకూలంగా పరిశీలనా గృహంలోని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వీరిలో నలుగురు బాలికలు తమ చేతులపై రక్తగాయాలు చేసుకున్నారు. తమను కన్నబిడ్డల్లా చూసుకునే నందగోపాల్ నిరపరాధి అని నినాదాలు చేశారు. వెంటనే ఆయన్ను విడుదల చేయాలంటూ కొందరు కన్నీరు పెట్టకున్నారు. తామీ విషయాన్ని ఎక్కడైనా చెబుతామని మీడియాకు తెలిపారు. విద్యార్థినులు చేతులు కోసుకున్న విషయం తెలిసుకుని వెస్ట్ పోలీసులు, సీడబ్ల్యుసీ సభ్యులు వెంటనే అక్కడకు చేరుకుని విద్యార్థినులను సముదాయిస్తున్నారు. గాయ పడ్డ వారికి ప్రాథమిక చికిత్స అందించారు. మరింత మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నందగోపాల్‌పై ఫిర్యాదు చేసిన అమ్మాయి లెస్బియన్ అంటూ కొందరు బాలికలు చెప్పడం గమనార్హం. ఇదిలావుంటే సూపరింటెండెంట్ నందగోపాల్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. స్థానిక కొర్లగుంట జంక్షన్ వద్ద సీపీఎం నగర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆయన దిష్టిబ్మొను దగ్ధం చేశారు. ఆయన్ను కఠినంగా శిక్షించాంటూ నినాదాలు చేశారు. రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌డిఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనాథ పిల్లలను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన నందగోపాల్ రాక్షసంగా ప్రవర్తించాడని మండిపడ్డారు. వెంటనే ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి ఆధ్వర్యంలో స్థానిక సరోజినిదేవీ రోడ్డులో ధర్నా చేశారు. బాలికలకు కాపాడాల్సిన నందగోపాల్ మేకవనె్న పులిలా ఎంతమంది అమాయక బిడ్డలకు అన్యాయం చేశాడో విచారించాలన్నారు. బాధిత బాలిక బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. నగరంలోని అన్ని పరిశీలనా గృహాలను షీటీం తరచూ పర్యవేక్షించాలని కోరారు. పలు ప్రజా, మహిళా సంఘాలు సైతం ఈ సంఘటనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. పరిశీలనా గృహంలోని విద్యార్థినులు నందగోపాల్‌కు అనుకూలంగా మాట్లాడుతున్న తీరు ఇప్పుడు అధికారులను ఆలోచనలో పడేసింది. వారికి ఎలా చెప్పాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.