క్రైమ్/లీగల్

మద్యం సేవించి ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపట్నం, నవంబర్ 12 : మద్యం సేవించి ఒకరు మృతి చెందిన సంఘటన కొత్తపట్నం మండలంలోని బీరంగుంటలోని ప్రియా ఆక్వా చెరువుల వద్ద సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాల్లోకి వెళితే విశాఖపట్నం జిల్లా బొమ్మల లక్ష్మీపురం మండలం పెద్దగంజ గ్రామానికి చెందిన నిమ్మక రాజేంద్రప్రసాద్ (22) అనే వ్యక్తి గత మూడేళ్ల క్రితం నుండి బీరంగుంటలోని ప్రియా ఆక్వా చెరువుల వద్ద పనిచేస్తున్నాడు. మృతుడు ఆదివారం అర్థరాత్రి 12 గంటల సమయంలో మద్యం సేవించాడు. దీంతో వాంతులు, విరోచనాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడని తెలిపారు. ఫ్లోర్ ఇన్‌చార్జి సమాచారం మేరకు పోలీసులకు సమాచారం అందించారు. కొత్తపట్నం ఎస్‌ఐ శివబసవరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. అనంతరం మృతుని బంధువులకు మృతదేహాన్ని అప్పగించడం జరుగుతుందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.

ఎస్‌పి సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే
ఒంగోలు, నవంబర్ 12: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్‌పి బి సత్యఏసుబాబు ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ గ్రీవెన్స్‌డే కార్యక్రమానికి మొత్తం 46 మంది అర్జీదారులు పాల్గొని తమ అర్జీలను ఎస్‌పి సత్య ఏసుబాబుకి అందజేసి వారి సమస్యలను పరిష్కంచాల్సిందిగా కోరారు. దీంతో స్పందించిన జిల్లా ఎస్‌పి సత్య ఏసుబాబు సంబంధిత అధికారులకు వారి సమస్యలను తెలియజేసి పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఈ గ్రీవెన్స్ డే కు వచ్చే దివ్యాంగులు ఇబ్బంది పడకుండా, వారి సౌకర్యార్ధం సేవా దళ్ పేరుతో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, వీల్ చైర్ ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగులను వీల్‌చైర్లో కూర్చో పెట్టుకుని ఎస్‌పి వద్దకు తీసుకుని పోయి, తమ సమస్యలు చెప్పుకునేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది.

దొంగతనం కేసులో నిందితుడు అరెస్టు
మర్రిపూడి,నవంబర్ 12:మండలంలోని ఎస్‌టి రాజుపాలెంకు చెందిన కాలేటి ఆదినారాయణ ఇంటిలో అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి దొంగతనం చేసి సుమారు 23వేల రూపాయలకు పైగా నగదును దోచుకున్నట్లు ఫిర్యాదుదారుడు ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. నిందితుడు నరేష్‌ను పొదిలి కోర్టుకు హాజరుపర్చగా 14రోజులు రిమాండ్ విధించినట్లు ఆయన తెలిపారు. ఈనెల 9వతేదీ మధ్యాహ్న సమయంలో నిందితుడు నారాయణ ఇంటిలోని వెనుకవైపు ఇంటిలోకి వెళ్లి తలుపులు పగలకొట్టి మూడువేల ఐదువందల 30రూపాయల నగదు, ఎటిఎం కార్డులను దొంగిలించి ఎటిఎం ద్వారా మరో 20వేల రూపాయలను డ్రా చేసినట్లు ఫిర్యాది పేర్కొన్నారని ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు.