క్రైమ్/లీగల్

శిశువును విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, నవంబర్ 12: తల్లికి తెలియకుండా మూడు రోజుల మగ శిశువును విక్రయిస్తున్న ముగ్గురిని రామగుండం కమీషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మంచిర్యాలకు చెందిన పత్తి సత్తమ్మ, గోదావరిఖనికి చెందిన గాధం లక్ష్మి, బి.శ్రీ్ధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద పత్తి సత్తమ్మ, గాధం లక్ష్మిలు మగ శిశువును బి.శ్రీ్ధర్ అనే వ్యక్తికి విక్రయిస్తుండగా పక్కా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ సిఐ సాగర్ వీరిని పట్టుకున్నారు. మంచిర్యాల మారుతి నగర్‌కు చెందిన ఫర్వీన్ బేగం అనే మహిళ గత నెల 20న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పురుడు పోసుకొని మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే భర్త, తల్లిదండ్రులు సమయానికి దగ్గర లేకపోవడంతో ఇంతకు ముందు పరిచయం ఉన్న ఇంటి దగ్గరి మహిళ అయిన పత్తి సత్తమ్మ ఆసుపత్రిలో చేర్పించి దగ్గరుండి చూసుకుంటానని నమ్మించి శిశువు పుట్టిన వెంటనే ఎత్తుకెళ్లి గాధం లక్ష్మి ద్వారా శ్రీ్ధర్‌కు 3లక్షల రూపాయలకు అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకుంది. వీరి వద్ద నుంచి 60వేల రూపాయలు స్వాధీన పరుచుకున్నారు. కాగా శిశువును తల్లి ఫర్విన బేగంకు సోమవారం కమీషనరేట్ కార్యాలయంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్ అప్పగించారు. పట్టుకున్న నిందితులను తదుపరి విచారణ కోసం మంచిర్యాల ఎస్ హెచ్ ఓకు అప్పగించారు.