క్రైమ్/లీగల్

సీబీఐ కేసు 16కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: సీబీఐ డైరెక్టర్ అలోక్‌కుమార్ వర్మపై నిర్వహించిన దర్యాప్తుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సోమవారం సీల్డ్‌కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. నివేదికను స్వీకరించిన చీఫ్‌జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కె కౌల్‌తో కూడిన ధర్మాసనం కేసును తదుపరి విచారణ నిమిత్తం ఈనెల 16కు వాయిదా వేసింది. అలాగే తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు తాను అక్టోబర్ 23 నుంచి 26 వరకు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించారు. అంతకుముందు సీవీసీ తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ సుప్రీం కోర్టు మాజీ జడ్జి ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో సీవీసీ విచారణ నవంబర్ 10కల్లా పూర్తయ్యిందని చెప్పారు. కాగా దీనికి సంబంధించి రిజిస్ట్రార్ ఆదివారం కూడా పనిచేశారని, అయితే దర్యాప్తునకు సంబంధించిన నివేదికకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని చీఫ్‌జస్టిస్ పేర్కొనగా, సోలిసిటర్ జనరల్ క్షమాపణ కోరారు.
సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని అక్టోబర్ 26న ఉన్నత న్యాయస్థానం సీవీసీని ఆదేశిస్తూ, దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీం మాజీ న్యాయమూర్తిని నియమించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తును జరిపి రెండు వారాల్లో నివేదికను తమకు సమర్పించాలని ఆదేశించింది. కాగా, తనను సీబీఐ చీఫ్ పదవి నుంచి తొలగించడాన్ని, తనను సెలవుపై పంపడంపై ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సీవీసీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీచేసింది. అలాగే తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావు అక్టోబర్ 23 నుంచి 26 మధ్య తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నివేదికను సైతం సమర్పించాలని కోరింది.