క్రైమ్/లీగల్

దొంగల అరెస్ట్ .. చోరీ సొత్తు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, నవంబర్ 12: ఇద్దరు దొంగలను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు రూ.7 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ శ్రీనివాసులు, డీఐ సుమన్ కుమార్ వెల్లడించారు. జగద్గిరిగుట్ట డివిజన్ శివానగర్‌లో నివాసముండే మంద కుమార్(35) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తాడు. వరంగల్ జిల్లాకు చెందిన పొలిపాక కుమార్ (33) ప్రైవేట్ ఉద్యోగి. తాళాలు ఉన్న ఇళ్లను ఎంచుకుని దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. డీఐ సుమన్ కుమార్ సిబ్బందితో ఈనెల 11న ఎల్లమ్మబండలో వాహనాల తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఇళ్లలో దొంగతనాలే కాకుండా బస్సుల్లో ప్రయాణించే వారి జేబుల్లో, పర్సులను దొంగిలిస్తున్నారు. మొత్తం 11 కేసులలో కుమార్ నిందితుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుల పై కేపీహెచ్‌బీ, బాలానగర్, జగద్గిరిగుట్ట పీఎస్‌లలో కేసులు ఉన్నాయని తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 17 తులాల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి, రూ.34 వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
వాహనాల తనిఖీ
కొందుర్గు, నవంబర్ 12: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. సోమవారం జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని తూంపల్లి చౌరస్తాలో వాహనాల తనిఖీ చేపట్టారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు అక్రమ నగదు, మద్యం వంటివి నిషేధించడానికి రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ విజయ్ కుమార్ పాల్గొన్నారు.