క్రైమ్/లీగల్

రూ. 10 లక్షల విలువైన 160 కార్టన్ల మద్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 12: జిల్లా కేంద్రమైన నాగర్‌కర్నూల్ సమీపంలోని నెల్లికొండ గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 160 మద్యం కార్టన్లను సోమవారం స్థానిక ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి పట్టుకున్నారు. సీఐ వివరాల ప్రకారం... ఎన్నికల సమయం కావడంతో మద్యం నిలువలు, సరఫరాపై కట్టుదిట్టమైన నిఘాను పెట్టడం జరిగిందని, ఈ నేపథ్యంలోనే నెల్లికొండలో అక్రమంగా మద్యం నిలువ ఉంచినట్లు సమాచారం రావడంతో మహబూబ్‌నగర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ గణపతిరెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన సిబ్బందితోపాటు స్థానిక ఎక్సైజ్ సిబ్బంది కలిసి సంయుక్తంగా సోమవారం నెల్లికొండ గ్రామంలోని కమ్మరి భరత్ ఇంట్లో ఆకస్మిక దాడులను చేయడం జరిగిందన్నారు. ఈ దాడులలో అక్రమంగా దాచిన 160 మద్యం కార్టన్లను గుర్తించడం జరిగిందని, వాటిని పరిశీలించగా ఎంసీ ప్లాటినం 63 కార్టన్లు, రాయల్‌స్టాక్ 50 కార్టన్లు ఉన్నాయని, ఇవ్వన్నీ ఫుల్ బాటిళ్లు కాగా, ఐబీ 47 కార్టన్లు క్వార్టర్లని చెప్పారు. వీటి విలువ సుమారు రూ. 10లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు తెలిపారు. ఎన్నికల సమయంలో కావడంతో అనుమతిలేకుండా ఎవ్వరైనా మద్యం అక్రమంగా నిలువ ఉంచినట్లైతే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
సోమవారం పట్టుకున్న మద్యంపై పూర్తిస్థాయిలో విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. గ్రామాలలో గట్టినిఘాను పెట్టడం జరిగిందన్నారు. మద్యంతోపాటు నాటుసారా కాచినా, అమ్మిన, నిలువ ఉంచుకున్న కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో తనతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ గణపతిరెడ్డి, స్థానిక ఎక్సైజ్ ఎస్సై ఫయాజోద్దీన్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.

చిత్రం..మద్యం స్వాధీనం చేసుకుంటున్న దృశ్యం